Home> వినోదం
Advertisement

Tollywood: కాజల్ స్థానంలో తాప్సీను ఎంచుకున్న తేజ, త్వరలో షూటింగ్ ప్రారంభం

Tollywood: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలో టైటిల్ రోల్ పాత్రధారి మారిపోయిందని సమాచారం. ఒక హీరోయిన్‌ను అవుట్ చేసి..మరో హీరోయిన్‌ను ఇన్ చేస్తున్నాడట తేజ..

మహిళా ఓరియెంటెడ్ ( Female oriented ), ప్రేమ కధా చిత్రాల్ని తెరకెక్కించడంలో టాలీవుడ్ దర్శకుడు ( Tollywood Director ) తేజ ( Teja ) సుప్రసిద్ధుడు. ప్రస్తుతం తేజ దృష్టి అంతా ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ అలివేలు వెంకట రమణ ( Alivelu venkata ramana ) పై ఉంది. లిమిటెడ్ బడ్జెట్‌తో సినిమా తీసేందుకు తేజ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో లీడ్ రోల్‌లో ముందు కాజల్ ( Kajal Aggarwal ) బాగుంటుందని తేజ అనుకున్నాడు. తరువాత ఎందుకో మనసు మార్చుకున్నాడు. పరిస్థితి మారింది. ఇప్పుడు కాజల్ స్థానంలో హిందీ చిత్ర పరిశ్రమలో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రాచుర్యం పొందిన తాప్సీని ఎంపిక చేశాడని సమాచారం. తాప్సీ ఇప్పటికే ఫీమేల్ లీడ్ రోల్స్‌లో పేరు తెచ్చుకుంది. అందుకే తాప్సీ అయితే బాగుంటుందని తేజ భావిస్తున్నాడట.

ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా నేపధ్యంలో హిందీ సినిమాలో బిజీగా ఉన్న తాప్సీ ( Taapsi ) ..ఆ సినిమా పూర్తవగానే తేజ సినిమాను సైన్ చేయవచ్చని తెలుస్తోంది. అటు తేజ  ( Teja ) ఇప్పటికే అలివేలు వెంకట రమణ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజిగా ఉన్నాడు. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 

Also read: Rhea Chakraborty: సోదరునితో కలిసి ఇంటి కోసం వెతుకుతున్న రియా చక్రవర్తి

Read More