Home> వినోదం
Advertisement

Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్

Kalki 2898 AD Collections: జూన్ 27న విడుదలైన.. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా ..చెప్పనవసరం లేదు. నిన్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలోనూ.. మంచి కలెక్షన్ సాధించింది. కాగా ఈ సినిమా గురించి.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన.. స్వప్నా దత్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది..

Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్

Kalki 2898AD Review : 

ఎవడే సుబ్రహ్మణ్యం.. సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ తరువాత తీసిన మహానటి చిత్రంతో.. సెన్సేషనల్ డైరెక్టర్ గా మారారు. మహానటి సినిమాకి.. ఎన్నో ప్రశంసలతో పాటు.. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత వెంటనే.. భారీ బడ్జెట్ తో కల్కి చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి.. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక నిన్న జూన్ 27న విడుదలైన.. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే కలెక్షన్ సాధిస్తోంది..

ప్రభాస్ కల్కి సినిమాని వైజయంతో మూవీస్ బ్యానర్ పై.. ప్రముఖ నిర్మాత అశ్వినిదత్.. ఆధ్వర్యంలో ఆయన ఇద్దరు కూతుళ్లు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా వీరిద్దరు ఎంతో ఆక్టివ్ గా పాల్గొన్నారు. ఇందులో స్వప్నా దత్ ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ భార్య కావటం విశేషం.
ముఖ్యంగా  సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ కి గాను దర్శకుడు ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఈ సినిమాని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని పొగిడేస్తున్నారు.

ఇక ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కల్కి సినిమా మొదటి రోజు.. 180 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని బాక్సాఫీస్ సమాచారం. అయితే ఈ చిత్రం పలు చోట్ల కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డ్స్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ గురించి.. పలువురు నిర్మాతలను అడుగుతున్నట్టు సమాచారం. దీనిపై నిర్మాత స్వప్న దత్ స్పందిస్తూ సోషల్ మీడియాలో.. ఓ పోస్ట్ వేసింది.

స్వప్న దత్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ‘నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలామంది నాకు ఫోన్ చేసి మరి రికార్డ్స్ క్రాస్ చేశామా అని అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్ళెవరూ.. ఆ రికార్డుల కోసం ఈ సినిమాలు తీయరు.  ప్రేక్షకుల కోసం, సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా కల్కి సినిమాని అలాగే తీసాం’ అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ.. వైరల్ గా మారింది. 

 

Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More