Home> వినోదం
Advertisement

Nag Ashwin: కీర్తి సురేష్‌ను 'మహానటి'గా మార్చిన ఆ ఒక్క సీన్‌.. షాకింగ్ విషయం బయటపెట్టిన నిర్మాత

Keerthy Suresh: మహానటి సినిమాలో లెజెండరీ నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటన.. ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అసలు ఆ పాత్రకి కీర్తి సురేష్ ని..తీసుకోవాలని..ఎలా అనిపించింది అనేది చాలామందికి తెలియదు. చిత్ర నిర్మాత స్వప్న దత్ ఈ మధ్యనే.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు.

Nag Ashwin: కీర్తి సురేష్‌ను 'మహానటి'గా మార్చిన ఆ ఒక్క సీన్‌.. షాకింగ్ విషయం బయటపెట్టిన నిర్మాత

Nag Ashwin Mahanati: ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో నాగ్ అశ్విన్.. కూడా ఒకరు. ప్రతి సూపర్ హిట్ సినిమాతో నాగ్ అశ్విన్ ఈ విషయాన్ని..నిరూపిస్తూనే వచ్చారు. ముఖ్యంగా మహానటి సినిమాని నాగ్ అశ్విన్.. తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 

సినిమా చూసినంత సేపు తెలుగు ప్రేక్షకులలో చిరకాలం గుర్తుండి పోయి.. సావిత్రిని నిజంగానే మరొకసారి వెండి తెరమీద చూసినట్లు అనిపిస్తుంది.  దానికి కారణం కీర్తి సురేష్ నటన.. మాత్రమే కాదు నాగ్ అశ్విన్ కి ఉన్న విజన్ కూడా అని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని స్వప్న దత్ కూడా చెబుతున్నారు. 

"ఒకరోజు సడన్గా నాగి.. కీర్తి సురేష్ అని మెసేజ్ చేసాడు. దానికి ముందు నుంచి మేము సావిత్రి అమ్మ ఫోటో పక్కన పెట్టి చాలా మంది హీరోయిన్ల ఫోటోలు చూస్తూ ఉన్నాము. వాళ్ళ ట్రెడిషనల్ లుక్ తో ఉన్న ఫోటోలతో సర్వే చేస్తున్నాము. సడన్గా ఒక రోజు ఉదయం నాగి.. కీర్తి సురేష్ అని మెసేజ్ చేశాడు. నేను కీర్తి సురేష్ ఏంటి అని అడిగాను. అప్పటికి కీర్తి సురేష్ నేను శైలజ మూవీ లో నటించింది. నాగి అప్పుడు ఆమెలో సావిత్రి అమ్మ కనిపిస్తుంది అని మెసేజ్ చేసాడు. ధనుష్ సినిమాలో ఆమెది.. ఒక సీన్ చూపించాడు. అది ఒక ట్రైన్ సీన్. చాలా కామెడీగా ఉండే ఆ సీన్లో కీర్తి సురేష్ మేకప్ లేకుండా కనిపిస్తుంది. లుక్ టెస్ట్ మేము మా ఇంట్లో చేసాము. దేవదాస్ కాస్ట్యూమ్ వేశాము. నేను, ప్రియాంక అందరం.. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. మేకప్ పూర్తయి తను బయటికి రాగానే మేమంతా.. షాక్ అయిపోయాము. అసలు నమ్మ లేకపోయాము" అంటూ చెప్పుకొచ్చారు స్వప్న దత్. 

ఎవరు ఊహించినటువంటి విధంగా కీర్తి సురేష్ లో సావిత్రిని చూశారు నాగ్ అశ్విన్. చూడటం మాత్రమే కాక ఎంత బాగా సూట్ అవుతుందో నిరూపించి మరీ చూపించారు. ఇక మహానటి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఇక నాగ్ అశ్విన్ ఈ మధ్యనే దర్శకత్వం వహించిన కల్కి సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. విడుదల అయ్యి ఐదు రోజులు గడుస్తున్నా కూడా సినిమా మాత్రం కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. అదిరిపోయే ట్విస్ట్ తో ఎండ్ అయ్యే ఈ సినిమాకి సీక్వెల్ కూడా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.

Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!

Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More