Home> వినోదం
Advertisement

Sushmita Konidela Daughter : చిరు 'బాస్ పార్టీ' సాంగ్.. తాత పాటకు మనవరాలు స్టెప్పులు.. సుష్మిత కూతురు రచ్చ

Sushmita Konidela Daughter వాల్తేరు వీరయ్య సాంగ్ షూటింగ్ కోసం చిరంజీవి తన ఫ్యామిలీని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. చిరంజీవి శ్రీదేవీ పాట కోసం తన కుటుంబంతో కలిసి చిరంజీవి వెళ్లగా.. అక్కడ సుష్మిత కూతురు ఇలా చిందులు వేసింది.

Sushmita Konidela Daughter : చిరు 'బాస్ పార్టీ' సాంగ్.. తాత పాటకు మనవరాలు స్టెప్పులు.. సుష్మిత కూతురు రచ్చ

Sushmita Konidela Daughter Dance చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన పాటలు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. మొన్నామధ్య వచ్చిన బాస్ పార్టీ మీద మొదట్లో బాగానే ట్రోలింగ్ జరిగింది. కానీ ఆ తరువాత తరువాత ఆ పాటే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇక ఇప్పుడు చిరంజీవి శ్రీదేవీ పాట కూడా వచ్చింది. అది జనాలకు బాగానే ఎక్కేసేలా ఉంది. అయితే ఇప్పుడు చిరంజీవి శ్రీదేవీ పాట షూటింగ్ సమయంలో బాస్ పార్టీ సాంగ్‌కు చిరు మనవరాలు స్టెప్పులు వేసింది.

చిరంజీవి శ్రీదేవీ పాట షూటింగ్ కోసం స్విస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య టీంతో పాటుగా చిరంజీవి తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాడు. సురేఖ, సుష్మిత ఇలా అందరినీ అక్కడకు తీసుకెళ్లారు. ఇక అక్కడే ఇలా చిరంజీవి మనవరాలు శేఖర్ మాస్టర్‌తో కలిసి స్టెప్పులు వేసింది. సుష్మిత కూతురు చిరంజీవి బాస్ పార్టీ సాంగ్‌కు ఇలా డ్యాన్స్ వేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sushmita (@sushmitakonidela)

బాస్ పార్టీ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలా రీల్ వీడియో చేస్తూ చిరు మనవరాలికి కూడా స్టెప్పులు నేర్పించాడు శేఖర్ మాస్టర్. ఈ రీల్ వీడియోను సుష్మిత షేర్ చేస్తూ..  తన కూతురిని చూసి మురిసిపోయింది. సుష్మిత షేర్ చేసిన ఈ వీడియోపై మై బేబీ అంటూ స్పందిస్తూ తెగ సంబరడిపోయింది నిహారిక.

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు శ్రుతి హాసన్ హీరోయిన్. ఇక ఈ రెండు చిత్రాలను తెరకెక్కించింది మైత్రీ మూవీస్ కావడం విశేషం.

Also Read : Gautam Ghattamaneni Birth Issue : రోజుకు గ్రా. 10 పెరగాల్సిందేనట.. గౌతమ్‌ పుట్టిన సమయంలో వచ్చిన సమస్య ఇదే.. నమ్రత ఎమోషనల్

Also Read : Chiranjeevi Nenoka Natudni : 'నేనొక నటుడ్ని'.. అల్పసంతోషిని, దేవుడ్ని, జీవుడ్ని.. చిరు మాటల ప్రవాహాం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More