Home> వినోదం
Advertisement

Krishna fans Angry: మళ్లీ పెళ్లి సినిమా.. నరేష్ మీద సూపర్ స్టార్ కృష్ణ ఫాన్స్ ఆగ్రహం!

Super Star Krishna fans angry on Actor Naresh: నటుడు నరేష్ నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కిస్తున్నారు, అయితే ఈ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Krishna fans Angry: మళ్లీ పెళ్లి సినిమా.. నరేష్ మీద సూపర్ స్టార్ కృష్ణ ఫాన్స్ ఆగ్రహం!

Krishna fans angry on Actor Naresh: గత కొంతకాలంగా నటుడు నరేష్ తన సినిమా వార్తలతో కాకుండా పర్సనల్ లైఫ్ వల్ల ఎక్కువగా వార్తలోకి ఎక్కుతున్నారు. నటుడు నరేష్ పవిత్ర లోకేష్ తో అక్రమ సంబంధంలో ఉన్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ మధ్యలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూడా ఇదే విషయాన్ని కన్నడ మీడియా సహా తెలుగు మీడియా ముందు పెట్టి రచ్చ రచ్చ చేసింది.

ఏకంగా నరేష్ పవిత్ర మైసూర్ లోని ఒక హోటల్లో బస చేసినప్పుడు అక్కడికి మీడియాని కూడా తీసుకువెళ్లి ఆమె చేసిన రగడ అంతా కాదు. ఇప్పుడు నరేష్ ఆసక్తికరంగా తన జీవితాన్నే ఒక కథగా మలిచి మళ్లీ పెళ్లి అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నరేష్ పవిత్ర నిజ జీవిత పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన వ్యవహారం తెరమీదకు వస్తోంది. అదేమిటంటే నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కిస్తున్నారు.

Also Read: Custody Movie Review: 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య హిట్టు కొట్టాడా?

కాబట్టి ఈ సినిమాలో తన తల్లి విజయనిర్మల తల్లి వివాహం చేసుకున్న సవతి తండ్రి కృష్ణ పాత్రలు కూడా చూపించబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు, విజయ నిర్మల పాత్రలో జయసుధ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాక ఇది కరెక్ట్ కాదని నరేష్ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మీరు చేసుకుంటున్నది ఏదో చేసుకోండి అంతేగాని ఇందులో ఏమాత్రం సంబంధం లేని సూపర్ స్టార్ కృష్ణ గారిని లాగడం ఏ మాత్రం బాలేదని వారు అంటున్నారు. నరేష్ పవిత్ర ప్రధాన పాత్రలలో మళ్ళీ పెళ్లి అనే సినిమా రూపొందింది.

ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నరేష్ స్వయంగా తన సొంత విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చెప్పబడుతున్న ఈ సినిమా మే 26వ తేదీన ఇటు తెలుగు అటు కన్నడ భాషలో రిలీజ్ అవుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్రలో తమిళ వివాదాస్పద నటి వనిత విజయ్ కుమార్ నటిస్తోంది.

Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More