Home> వినోదం
Advertisement

Dhanush’s D50: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సందీప్ కిషన్.. మళ్లీ ధనుష్ సినిమాలో కీ రోల్!

Sundeep Kishan in Dhanush’s D50: ధనుష్ హీరోగా సన్ పిక్చర్స్ సంస్థ ధనుష్ 50వ సినిమాని కూడా  నిర్మిస్తున్నట్లుగా కొన్నాళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాలో ఒక తెలుగు హీరో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

Dhanush’s D50: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సందీప్ కిషన్.. మళ్లీ ధనుష్ సినిమాలో కీ రోల్!

Sundeep Kishan to play Dhanush’s brother in D50: ధనుష్ హీరోగా సన్ పిక్చర్స్ సంస్థ తిరుచిత్రంబళం అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాని తెలుగులో తిరు పేరుతో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఇక ఆ తర్వాత ధనుష్ 50వ సినిమాని కూడా సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మిస్తున్నట్లుగా కొన్నాళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది.

ఇంకా ఈ సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్ అలాగే నటీనటులు వివరాల మీద కాస్త సందిగ్ధం కొనసాగుతున్నా ఈ సినిమా మాత్రం అటు తమిళ వర్గాలతో పాటు తెలుగు ఆడియన్స్ మీద కూడా ఆసక్తి రేకెత్తిస్తోందనే చెప్పాలి. ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ అనుకుంటుండగా ధనుష్ స్వయంగా ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే విష్ణు విశాల్, కాళిదాసు జయరామ్, దసరా విజయన్ వంటి వారు భాగస్వాములు అవుతున్నట్లుగా అధికారిక ప్రకటనలు వచ్చాయి.

Also Read: Deepthi Sunaina Photos: క్లీవేజ్ ట్రీట్ తో రెచ్చిపోయిన దీప్తి సునైన.. షన్నూతో బ్రేకప్ తరువాత తొలిసారి బోల్డ్ షో!

అయితే ఇప్పుడు తాజాగా ఒక టాలీవుడ్ హీరో కూడా ఈ సినిమాలో భాగమవుతున్నాడని ప్రచారం మొదలైంది. ఆ టాలీవుడ్ హీరో మరెవరో కాదు సందీప్ కిషన్. కెమెరామెన్ చోటా కె నాయుడు మేనల్లుడు అయిన సందీప్ కిషన్ తెలుగులో హీరోగా నిలదొక్కుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో ఆయన హీరోగా నటించాడు కానీ పూర్తిస్థాయి మార్కెట్ క్రియేట్ చేసుకోవడంలో మాత్రం వెనకబడే ఉన్నాడు.

అలాంటి సందీప్ కిషన్ ఇప్పుడు ధనుష్ 50వ సినిమాలో ఆయన సోదరుడు పాత్రలో కనిపించబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. నిజానికి సందీప్ కిషన్ ఇప్పటికే ధనుష్ హీరోగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక అక్కడ ఏర్పడిన పరిచయం రీత్యా సందీప్ కిషన్ కి ఈ సినిమాలో కూడా అవకాశం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాగా రూపొందినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా రిలీజ్ అయితే కానీ ఆ విషయం అయితే లేదు.

Also Read: Shriya Saran Photos: మెమోరీస్ అంటూ శ్రియ శరన్ హాట్ షో.. తల్లైనా తగ్గట్లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
Read More