Home> వినోదం
Advertisement

Srikanth Odela : దసరా డైరెక్టర్ గురించి సుకుమార్ చెప్పిన మాటలివే..వీడియో వైరల్

Dasara Director Srikanth Odela దసరా సినిమాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు శ్రీకాంత్ ఓదెల. పర్ఫెక్ట్ మాస్ మసాలా కమర్షియల్ సినిమాను తీయడంలో ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా శ్రీకాంత్ తన మొదటి సినిమాతోనే మెప్పించాడు.

Srikanth Odela : దసరా డైరెక్టర్ గురించి సుకుమార్ చెప్పిన మాటలివే..వీడియో వైరల్

Srikanth Odela worked at Sukumar సుకుమార్ శిష్యులు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. బుచ్చిబాబు సానా అయితే ఉప్పెనతో ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టేశాడు. రెండో సినిమా రామ్ చరణ్‌తో ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల నానితో దసరా అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఇది బాక్సాఫీస్ వద్ద ఎంత కొల్లగొడుతుందో ఇప్పుడే అంచనా వేయలేం. ఎందుకంటే రెండు రోజుల్లోనే యాభై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టేటసింది.

ఇక మరో శిష్యుడు సాయి ధరమ్ తేజ్‌తో విరూపాక్ష అనే సినిమాను తీశాడు. అది విడుదలకు సిద్దంగా ఉంది. ఇలా సుకుమార్ శిష్యులు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే బుచ్చిబాబు తీసిన ఉప్పెన సినిమాను తన సినిమాలా ప్రమోట్ చేశాడు సుకుమార్. కానీ శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాకు సుకుమార్ సాయం మాత్రం అందలేదు. సుకుమార్ ఎక్కడా ఈ సినిమా గురించి గానీ, తన శిష్యుడి గురించి గానీ స్పందించలేదు.

సుకుమార్ కూడా ఎక్కడా ఈ దసరా ప్రమోషన్స్‌లో కనిపించలేదు. అయితే సుకుమార్ గతంలో శ్రీకాంత్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. రంగస్థలంలో సుకుమార్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా శ్రీకాంత్ పని చేశాడు. రంగస్థలం మూవీకి క్యాస్టూమ్‌లను శ్రీకాంత్ దగ్గరుండి మ్యానేజ్ చేశాడట. ఒకే సారి వెయ్యి మంది కూడా రెడీగా ఉండేవాళ్లంట. అదంతా చూసి రామ్ చరణ్‌ ఆశ్చర్యపోయేవాడట. అయితే దాని వెనుకున్నది శ్రీకాంత్ అని సుకుమార్ ఓ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు.

 

అయితే సుకుమార్ దగ్గర శ్రీకాంత్ కేవలం ఓ సినిమాకు అసిస్టెంట్‌లా పని చేశాడని, ఆ తరువాత నేరుగా దసరా కథ మీద పడ్డాడని తెలుస్తోంది. అయితే దసరా సినిమాను చూస్తే అక్కడక్కడా రంగస్థలం ఛాయలు మాత్రం కనిపిస్తాయి. దీంతో అందరూ కూడా శ్రీకాంత్ మీద గురువు సుకుమార్ ప్రభావం గట్టిగానే ఉందని అంటున్నారు.

Also Read:  Dasara Collection : రెండో రోజుకే బ్రేక్ ఈవెన్?.. దసరా మేనియా.. నాని రేంజ్ ఇదే

Also Read: Ameesha Patel Bikini : బికినీలో అమిషా పటేల్.. సీనియర్ భామ భారీ అందాల ప్రదర్శన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More