Home> వినోదం
Advertisement

Pushpa 2: అల్లు అర్జున్ జాతర సీన్ ఓకే.. కానీ హెలికాప్టర్ల సీన్ అంతకుమించి..!

Pushpa 2 Jatara Fight: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతూవస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో జాతర సీన్ హైలైట్.. అని ఫాన్స్ ఎక్స్పెక్ట్ అవుతున్న.. సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాలో మరొక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం.

Pushpa 2: అల్లు అర్జున్ జాతర సీన్ ఓకే.. కానీ హెలికాప్టర్ల సీన్ అంతకుమించి..!

Pushpa 2 Update: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో.. త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య.. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న.. ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుంది అని ఫాన్స్ ఇప్పటినుంచే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మొదటి భాగం కంటే.. నిర్మాతలు ఈ సినిమా కోసం ఎక్కువ బడ్జెట్ వెచ్చిస్తున్న మాట వాస్తవమే. పైగా సినిమా మీద భారీ అంచనాలు కూడా ఉండడంతో.. కలెక్షన్లు కూడా పార్ట్ 1 కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. 

ఈ నేపథ్యంలో..తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ కి.. సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమాలో.. జాతర ఫైట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో.. మరొక అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉందని తెలుస్తోంది. ఈ మధ్యనే చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. పుష్ప ది రూల్.. సినిమాకి సంబంధించి ఒక అదిరిపోయే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. 

అది క్లైమాక్స్ ఫైట్ అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక సినిమాలో హెలికాప్టర్లతో.. ఒక మంచి సీన్ ఉంటుంది అని.. అది సినిమాకే అతిపెద్ద హైలైట్ గా ఉండబోతోంది అని తెలుస్తోంది. క్లైమాక్స్ లో రానున్న ఈ సీక్వెన్స్ లో.. సుకుమార్ స్టైల్ కనిపిస్తుందని.. జాతర పైకి కన్నా ఇది ఇంకా హైలెట్ గా నిలుస్తుంది.. అని వినికిడి.

ఏదేమైనా పుష్ప: ది రూల్ సినిమా మీద మాత్రం.. అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ మధ్యనే ఫహాద్ ఫాసిల్ పోషిస్తున్న పాత్ర పోస్టర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. 
పుష్ప సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లు అందుకుంది. పైగా పుష్పా సినిమాలో తన నటనకి గాను బన్నీ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. మరి పుష్ప రెండో భాగంతో.. బన్నీ, సుక్కు ఎన్ని అవార్డులు తెచ్చుకుంటారో వేచి చూడాలి.

Also Read: KTR Jail: అవినీతి కేసులో కేటీఆర్‌ జైలుకు ఖాయం: బండి సంజయ్ వ్యాఖ్యలతో కలకలం

Also Read: KTR Emotinal: జైలులో కవిత దుర్భరంగా ఉంది.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్‌ ఆవేదన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More