Home> వినోదం
Advertisement

Suchendra prasad: మైసూర్ ఘటన తర్వాత భర్తకు పవిత్ర లోకేష్ ఫోన్.. అవి బయటపెడతానన్న సుచేంద్ర ప్రసాద్!

Suchendra prasad about Pavitra lokesh: మైసూర్ ఘటన తర్వాత  పవిత్ర లోకేష్ తనకు ఫోన్ చేసి ఏం జరిగిందనే విషయం మీద వివరణ ఇచ్చారని సుచేంద్ర ప్రసాద్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

Suchendra prasad: మైసూర్ ఘటన తర్వాత భర్తకు పవిత్ర లోకేష్ ఫోన్.. అవి బయటపెడతానన్న సుచేంద్ర ప్రసాద్!

Suchendra prasad about Pavitra Lokesh: తెలుగు నటుడు నరేష్, పవిత్ర లోకేష్ మైసూరులోని ఒకే హోటల్ గదిలో ఉండగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వారిద్దనీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని గలాటా సృష్టించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం మీద పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు కన్నడ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి గతంలో సుచేంద్ర ప్రసాద్ పవిత్ర లోకేష్ క్యారెక్టర్ మంచిది కాదని ఆమె డబ్బు మనిషి, డబ్బు కోసం ఏమైనా చేస్తుంది అంటూ కామెంట్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు సుచేంద్ర ప్రసాద్ తాను అసలు ఆ మాటలు అనలేదని పవిత్ర చాలా మంచిదని అన్నట్లు మరోసారి ప్రచారం మొదలైంది. 

పవిత్ర లోకేష్ మీద తనకు నమ్మకం ఉందని ఈ వ్యవహారం జరిగిన తర్వాత కూడా ఆమె తనకు ఫోన్ చేసి ఏం జరిగిందనే విషయం మీద వివరణ ఇచ్చారని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాన్ని మీడియా రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదని, తమ పిల్లలకు ఈ విషయం తెలియదని ఇలాగే తమ పర్సనల్ జీవితాల మీద చర్చలు జరుపుతూ వెళితే తమ బిడ్డల భవిష్యత్తు ఏంటని ఆయన ప్రశ్నించారు. పవిత్ర లోకేష్ కు తనకు వివాహం జరిగిందని కానీ వివాహం జరగలేదని ఆమె ఎందుకు పేర్కొన్నారో తనకు తెలియదని సుచేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా వెల్లడించారు. 

హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లిళ్లలో చాలా మందికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండదు మేము కూడా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోలేదు కానీ పెళ్లి జరిగింది అనడానికి నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. అదేవిధంగా నా ఆధార్ కార్డులో పాస్పోర్ట్ లో సైతం ఆమె నా భార్య అని ఉంటుంది, ఆమె పాస్పోర్ట్ లో నా పేరు భర్త స్థానంలో ఉంటుందని సుచేంద్ర ప్రసాద్ వెల్లడించారు. వివాహానికి సంబంధించి ఇంకా మరికొన్ని ఆధారాలు ఉన్నాయని అవసరం అయితే వాటిని కూడా బయట పెడతానని ఆయన అన్నారు.. 

మీడియా ద్వారానే నరేష్ పేరు తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. పవిత్ర లోకేష్ కు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏదైనా ఉన్నా, తాము తాము తేల్చుకుంటాం తప్ప ఇలా మీడియా వరకు వచ్చే అవకాశం లేదని ఆయన చెప్పినట్లు ప్రచారం మొదలైంది. పవిత్ర లోకేష్, నరేష్ ఎలా అయితే వీడియో బైట్లు విడుదల చేసి క్లారిటీ ఇచ్చారో అలా సుచేంద్ర ప్రసాద్ ఏదైనా క్లారిటీ ఇస్తే తప్ప ఆయన పేరు మీద జరుగుతున్న ఈ ప్రచారానికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపించడం లేదు.

Also Read: Nagababu: భీమవరం సభపై నాగబాబు పంచులు.. చిరంజీవి తప్ప వారంతా మహానటులట!

Also Read: Actor sreejith ravi arrested: కారులో నుంచి నగ్నంగా దిగిన స్టార్ నటుడు.. సీసీ కెమెరాలో చూసి అరెస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య,     ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook

Read More