Home> వినోదం
Advertisement

3 రాష్ట్రాలకు అల్లు అర్జున్ కరోనా విరాళం

మెగా హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ కరోనాపై పోరాటానికి విరాళం ప్రకటించగా.. అల్లు అర్జున్ తాజాగా తన విరాళం ప్రకటించాడు.

3 రాష్ట్రాలకు అల్లు అర్జున్ కరోనా విరాళం

కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటానికి తన వంతు సాయం ప్రకటించాడు మెగా హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇదివరకే మెగా హీరోలు చిరంజీవి కోటి రూపాయలు ప్రకటించగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ.2కోట్ల రూపాయలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూ.70లక్షలు, సాయి ధరమ్ తేజ్ రూ.10లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన వంతుగా కరోనాపై పోరాటానికి రూ.1.25కోట్లు అందజేయనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు తన  ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.  కరోనా భయాలు.. యువకుడిని చితక్కొట్టిన ఎస్ఐపై వేటు

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఈ సమయంలో మానవత్వంతో వ్యవహిరిస్తున్నానని చెప్పాడు. తన వంతు బాధ్యతగా రూ.1.25కోట్ల మేర కరోనాపై పోరాటానికి సహకారం అందిస్తున్నట్లు వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు తెలిపాడు. ఇంటివద్దే ఉండాలని, బయట తిరగవద్దని సూచించాడు. కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్

ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, వీవీ వినాయక్ కరోనాపై పోరాటానికి తమ వంతు విరాళాన్ని ప్రకటించగా.. తాజాగా సుకుమార్ వంతు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.5లక్షలు అందజేయనున్నట్లు ప్రకటించాడు. టాలీవుడ్ నుంచి మొదటగా హీరో నితిన్ ఔదార్యం చూపాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10 లక్షల చొప్పున కరోనాపై పోరాటానికి తన వంతు సాయాన్ని అందించి మిగతావారిలో ఆలోచన వచ్చేలా చేశాడు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

బర్త్ డే బాయ్ Ram charan అరుదైన ఫొటోలు

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone 

ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos

Read More