Home> వినోదం
Advertisement

SS Thaman Alerted : హీరోల భజన విషయంలో అలెర్టయిన థమన్.. గమనించారా?

SS Thaman Alerted on Heros: మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే, ఈ విషయంలో ఈసారి ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆ వివరాలు

SS Thaman Alerted : హీరోల భజన విషయంలో అలెర్టయిన థమన్.. గమనించారా?

SS Thaman Alerted: మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటారు. దానికి కారణం ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన చేస్తున్న మ్యూజిక్ అని చెప్పక తప్పదు. సాధారణంగా థమన్  ఎలాంటి సాంగ్ చేసి రిలీజ్ చేసినా దానికి సంబంధించిన ఒరిజినల్ ట్యూన్ ని ఎక్కడ ఉందొ నెటిజన్లు పట్టుకొచ్చి ఆయనను కాపీ క్యాట్ అనే ముద్ర వేసి ట్రోల్ చేస్తూ రావడం సహజమే. అయితే ఈ మధ్యకాలంలో థమన్  తాను చేస్తున్న వ్యాఖ్యల వల్ల కూడా ట్రోల్ అవుతున్నాడు.

ఆయన ఈ మధ్య పలు తెలుగు సినిమాలకు పలు తమిళ్ సినిమాలకు కూడా పనిచేశాడు. అలా చేస్తున్న సమయంలో ఆయా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో రిలీజ్ ఈవెంట్లలో పాల్గొని సదరు హీరో అంటే తనకు చిన్నప్పటి నుంచి అభిమానం అని చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలే చూస్తూ ఆయన పాటలే వింటూ పెరిగానని చెప్పుకు రావడం హాట్ టాపిక్ గా మారుతుంది.

గతంలో బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు బాలకృష్ణను ఇదే రేంజ్ లో పొగిడేసిన ఆయన తమిళంలో వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు కూడా విజయ్ ని అదే రేంజ్ లో పొగిడాడు. దీంతో థమన్ ఏంట్రా మరి ఇలా తయారయ్యాడు అంటూ అందరూ కామెంట్ చేస్తున్న క్రమంలో థమన్ ఇప్పుడు కాస్త జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

తాజాగా జరిగిన ధనుష్ సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థమన్  జాగ్రత్త పడుతూ తాను ధనుష్ కి అభిమానిని అని తన అభిమాన హీరోలలో ధనుష్ కూడా ఒకరిని కామెంట్ చేశాడు. దీంతో థమన్ సోషల్ మీడియాలో తన మీద వస్తున్న నెగిటివ్ ట్రోలింగ్స్ ని చదువుకుంటున్నారేమో అందుకే ఈ విషయంలో జాగ్రత్త పడి ఉంటారు అంటూ కొన్ని కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనా థమన్  జాగ్రత్త పడి మరోసారి ట్రోలింగ్కి గురవకుండా బయటపడ్డాడనే చెప్పాలి.

Also Read: Ram Charan Narthan movie: ఆగిన క్రేజీ రామ్ చరణ్ ప్రాజెక్ట్.. అసలు విషయం ఏంటంటే?

Also Read: Trivikram Cooking: ఇంట్లో వంట త్రివిక్రమే చేస్తాడా.. అరెరే ఇలా బయట పెట్టేశాడు ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 
Read More