Home> వినోదం
Advertisement

Pedda kapu-1 Teaser: ఎన్టీఆర్ డైలాగ్​తో 'పెదకాపు -1' టీజర్​.. ఊర మాస్ గా వస్తున్న శ్రీకాంత్ అడ్డాల..!

Pedda kapu teaser:  డైరెక్టర్​  శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం 'పెద కాపు -1'. తాజాగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ డైలాగ్​తో మెుదలైన ప్రచార చిత్రం పవర్​ ప్యాక్ట్​డ్​గా ఉంది. 
 

Pedda kapu-1 Teaser: ఎన్టీఆర్ డైలాగ్​తో 'పెదకాపు -1' టీజర్​.. ఊర మాస్ గా వస్తున్న శ్రీకాంత్ అడ్డాల..!

Pedda kapu-1 movie teaser Out:  కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. మహేశ్ బాబుతో బ్రహ్మోత్సం వంటి డిజాస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ తర్వాత కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాత రూట్ మార్చి వెంకటేష్ తో‘నారప్ప’వంటి ఊర మాస్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు.

ఇప్పుడు మరోసారి మాస్ ఫార్ములాతోనే వస్తున్నాడు. ఇప్పుడు'పెద కాపు -1'. అనే టైటిల్ తో సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రానికి ఒక సామాజిక వర్గం పేరు పెట్టడమంటే కత్తి మీద సాము అనే చెప్పాలి. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఓ సామాన్యుడి సంతకం అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీ రాబోతుంది. 

ఈ సినిమా టీజర్ సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ స్పీచ్ తో మెుదలైంది. ''ఇది కేవలం జెండా కాదు.. మన ఆత్మ గౌరవం'', ''బాగా బతకడం అంటే నిన్నటి కంటే ఈయాల బాగుండాలి, ఈయాలి కంటే రేపు బాగుండాలి'' అనే డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. కొన్ని చోట్ల అసభ్యకరమైన పదజాలం కూడా వాడారు. టీజర్ చూస్తుంటే గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్యం కోసం జరిగే కొట్లాటలో ఎదురుతిరిగిన యువకుడి కథగా తెలుస్తోంది.

ఈ మూవీలో కొత్త కుర్రాడు విరాట్ కర్ణ హీరోగా నటించగా.. హీరోయిన్ గా ప్రగతి శ్రీవాస్తవ చేస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, నాగబాబు, తనికెళ్ళ భరణి, అనసూయ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  అఖండ (Akhanda) వంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ మూవీని కూడా నిర్మిస్తున్నారు. కోసమెరుపు ఎంటంటే శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక పాత్రలో కనిపించబోతున్నాడు.  

Also read: Mahesh Babu Workout: జిమ్​లో చెమటోడిస్తున్న మహేశ్​.. ఆ సినిమా కోసమేనా..?

Also read: Pawan Kalyan Tholi Prema: పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ రీరిలీజ్.. థియేటర్‌లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Read More