Home> వినోదం
Advertisement

Sreeleela: లక్ కోసం లుక్ మార్చిన హీరోయిన్.. ఈసారి అయినా వర్క్ అవుట్ అయ్యేనా!

Sreeleela Ravi Teja Movie: పెళ్లి సందడి, ధమాకా ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్న శ్రీలీల.. ఇప్పుడు వరుస డిజాస్టర్లతో.. సతమతమవుతున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి తో పర్వాలేదు అనిపించిన శ్రీలీల.. ఆ తర్వాత వరుసగా ఆది కేశవ, స్కంద, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఇలా వరుసగా ఫ్లాప్ లను అందుకుంది. ప్రస్తుతం రవితేజతో జత కడుతున్న.. శ్రీలీల కొత్త లుక్ తో అందరికీ షాక్ ఇచ్చింది. 

Sreeleela: లక్ కోసం లుక్ మార్చిన హీరోయిన్.. ఈసారి అయినా వర్క్ అవుట్ అయ్యేనా!

Sreeleela RT75: పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయిన శ్రీలీల మొదటి సినిమాతోనే.. బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన.. ఈ భామ వరుసగా బోలెడు ఆఫర్లు అందుకుంది. అయితే తన దారికి వచ్చిన ప్రతి సినిమాకి ఓకే చెప్పేసిన.. శ్రీలీల  వరుస ఫ్లాపులను అందుకుంది. 

ఒకప్పుడు.. ఒకేరోజు రెండు మూడు సినిమాలకి.. షూటింగ్ చేసిన శ్రీలీల.. ఒక రోజులో 12 గంటలకు పైనే షూటింగ్ లోనే ఉండేది. కానీ ఇప్పుడు చేతిలో ఒకే ఒక్క సినిమాతో.. వెలవెలబోతోంది. వరుసగా ఫ్లాప్ సినిమాలను అందుకున్న శ్రీలీల.. మార్కెట్ ఇప్పుడు బాగా పడిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో గుంటూరు కారం వంటి.. సినిమా చేసినప్పటికీ.. అది కూడా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. 

ఇక ప్రస్తుతం శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన.. హరీష్ శంకర్ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఎప్పుడూ విడుదలవుతుందో.. అసలు విడుదల అవుతుందో లేదో కూడా.. ఇంకా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీలీల.. పరిస్థితి ఏంటి అని అభిమానులు సైతం కంగారు పడుతున్న సమయంలో.. ఆమెకి గతంలో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ.. ఇప్పుడు మరొకసారి ఆమెకు అవకాశం ఇస్తున్నారు. 

ప్రముఖ రైటర్ భాను భోగ వరపు.. ఇప్పుడు రవితేజ హీరోగా చేస్తున్న ఒక సినిమాతో డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రవితేజ కరియర్ లో 75వ సినిమాగా.. ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటస్తోంది. తాజాగా సినిమా లాంచ్ కి హాజరైన శ్రీలీల కొత్త లుక్కుతో అందరికీ షాక్ ఇచ్చింది. 

ఒక అందమైన నారింజరంగు చీరలో శ్రీ లీల అందరి దృష్టిని ఆకట్టుకుంది. గతంలో కూడా చాలాసార్లు చీరలో కనిపించిన శ్శ్రీలీల ఇప్పుడు మాత్రం చాలా పద్ధతిగా హోమ్లీగా, ఒక హౌస్ వైఫ్ లాగా కనిపిస్తోంది. సడన్ గా స్టైలిష్ గా ఉండే శ్రీలీలలో.. ఇంత మార్పు ఎలా వచ్చింది అని అభిమానులు సైతం ఖంగు తిన్నారు. 

అయితే సినిమా కోసమే శ్రీలీల తన లుక్కు మార్చిందని.. కొందరు చెబుతున్నారు. ఇప్పటిదాకా గ్లామరస్ పాత్రలలో కనిపించిన శ్రీ లీల.. ఇప్పుడు రూట్ మార్చబోతోందా అని కూడా సందేహాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా శ్రీలీల కొత్త లుక్ అయినా ఆమెకు లక్ తెచ్చి పెడుతుందో లేదో చూడాలి.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More