Home> వినోదం
Advertisement

Sreeleela : స్టార్ హీరో తో శ్రీలీలకి అవకాశం.. హిట్ అయితే రచ్చే

Sreeleela Upcoming Movie: కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ తాజాగా ఇప్పుడు మార్క్ ఆంటినీ ఫేమ్ డైరెక్టర్ అధిక రవిచంద్ర తో ఒక సినిమాకి సైన్ చేశారు. గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అజిత్ షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Sreeleela : స్టార్ హీరో తో శ్రీలీలకి అవకాశం.. హిట్ అయితే రచ్చే

Good Bad Ugly: కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన తల అజిత్ కుమార్ ఈ మధ్యనే తునీవు సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. తెలుగు లో అంతంతమాత్రంగానే ఆడినప్పటికీ తమిళ్లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం అజిత్ తిరుమేని దర్శకత్వంలో విడ ముయర్చి అనే యాక్షన్ త్రిల్లర్ తో బిజీగా ఉన్నారు. 

ఈ సినిమా తర్వాత అజిత్ అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాల్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా మార్క్ ఆంటోనీ తో మంచి విజయాన్ని అందుకున్న అజిత్ కి కూడా మంచి హిట్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. వరుసగా స్కంద, ఆది కేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లతో డిజాస్టర్లు అందుకున్న శ్రీ లీల కెరియర్ కి ఇంకా ఎండ్ కార్డు పడినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో ఈ భామ అజిత్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశాన్ని అందుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా గనుక హిట్ అయితే కోలీవుడ్ నుంచి ఈమెకు బోలెడు ఆఫర్లు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

ఈ సినిమాకి గుడ్ బాడ్ అగ్లీ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అజిత్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అజిత్ 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగిపోతుంది ఇప్పటికే సంక్రాంతి బరిలో కొన్ని స్టార్ హీరోల సినిమాలు విడుదలకు ఎదురుచూస్తున్నాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి

Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరిక

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్‌ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More