Home> వినోదం
Advertisement

SPB mortal remains: ఫామ్‌హౌజ్‌కి బాలు భౌతికకాయం.. అక్కడే అంత్యక్రియలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని తొలుత ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి తరలించిన కుటుంబసభ్యులు.. అక్కడి నుంచి తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రానికి తరలించారు. బాలుని కడసారి చూసుకునేందుకు ఆయన సన్నిహితులు, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో ఆయన భౌతికకాయాన్ని నివాసం నుంచి వ్యవసాయక్షేత్రానికి తరలించారు.

SPB mortal remains: ఫామ్‌హౌజ్‌కి బాలు భౌతికకాయం.. అక్కడే అంత్యక్రియలు

చెన్నై: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ( SP Balasubrahmanyam mortal remains ) తొలుత ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి తరలించిన కుటుంబసభ్యులు.. అక్కడి నుంచి తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రానికి తరలించారు. బాలుని కడసారి చూసుకునేందుకు ఆయన సన్నిహితులు, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో ఆయన భౌతికకాయాన్ని నివాసం నుంచి వ్యవసాయక్షేత్రానికి తరలించారు. బాలు భౌతికకాయాన్ని ఫామ్ హౌజ్ కి తరలించారని తెలుసుకున్న అభిమానులు, ప్రముఖులు ఆయన్ని చివరి చూపు చూసుకునేందుకు అక్కడికి క్యూ కట్టారు. Also read : SP Balasubrahmanyam: బాలుకు, సూపర్ స్టార్ కృష్ణకు మధ్య విభేదాలు.. ఆరోజు ఏం జరిగిందంటే..

రేపు శనివారం ఉదయం 10.30 గంటలకు అదే వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు జరగనున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More