Home> వినోదం
Advertisement

Sourav Ganguly biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ ?

Ranbir Kapoor to play Dada in Sourav Ganguly biopic ? సౌరబ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ కి తాను అనుమతి ఇచ్చినట్టు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తెలిపారు. రూ. 200 నుంచి 250 కోట్ల భారీ బడ్జెట్‌తో గంగూలీ బయోపిక్ తెరకెక్కనుంది. గంగూలీ బయోపిక్ డైరెక్టర్ ఎవరు (Sourav Ganguly biopic director) అనేది ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం.

Sourav Ganguly biopic: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ ?

Ranbir Kapoor to play Dada in Sourav Ganguly biopic ? సౌరబ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ కి తాను అనుమతి ఇచ్చినట్టు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తెలిపారు. రూ. 200 నుంచి 250 కోట్ల భారీ బడ్జెట్‌తో గంగూలీ బయోపిక్ తెరకెక్కనుంది. గంగూలీ తన బయోపిక్ వివరాలు వెల్లడిస్తూ.. '' బయోపిక్ మూవీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ సినిమా హిందీలోనే తెరకెక్కనుంది కానీ డైరెక్టర్ ఎవరు (Sourav Ganguly biopic director) అనేది ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం'' అని అన్నారు. బయోపిక్ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు ఇంకొద్ది రోజులు సమయం పడుతుందని గంగూలీ చెప్పినట్టుగా న్యూస్ 18 పేర్కొంది.

సౌరవ్ గంగూలీ బయోపిక్ నిర్మించనున్న చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే స్క్రిప్ట్ విషయంలో గంగూలీతో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది. బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం గంగూలీ బయోపిక్ లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor in Sourav Ganguly biopic) టైటిల్ రోల్ పోషించనున్నట్టు తెలుస్తోంది. 

Also read : Rama Rao on Duty first look: రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ లుక్ పోస్టర్

గతంలో తన రియల్ స్టోరీపై బయోపిక్ రూమర్స్‌ని కొట్టిపారేసిన సౌరవ్ గంగూలీ.. '' ఒకవేళ బయోపిక్ అంటూ తెరకెక్కిస్తే.. తన పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తే చూడాలని ఉంది'' అని తన మనసులో మాటను వెల్లడించిన సంగతి తెలిసిందే. 

సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కినట్టయితే, గతంలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni), మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్ వంటి స్టార్ క్రికెటర్స్ జీవితాల ఆధారంగా వచ్చిన బయోపిక్స్ జాబితాలో గంగూలీ బయోపిక్ కూడా చేరుతుంది.

Also read: Jr NTR Movie: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా అక్టోబర్‌లో ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More