Home> వినోదం
Advertisement

Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్

MLA Prakash Phaterpekar son Attacked Sonu Nigam శివసేన ఎమ్మెల్యే కొడుకు సోను నిగమ్‌పై దాడి చేశాడు. ఈవెంట్‌లో జరిగిన చిన్న వాగ్వాదం చివరకు పెద్ద గొడవలా మారింది. వారు చేసిన దాడిలో సోను నిగమ్‌కు గాయాలవ్వడంతో హాస్పిటల్‌లో చేర్పించారు.

Sonu Nigam Attack Video : స్టార్ సింగర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి.. ఈవెంట్‌లో గొడవ.. వీడియో వైరల్

Sonu Nigam Attack Video బాలీవుడ్ స్టార్ సింగర్ సోను నిగమ్‌ మీద శివసేన ఎమ్మెల్యే కొడుకు దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సోను నిగమ్ సెల్ఫీ ఇచ్చేందుకు నిరాకరించడంతో అతని మీద, అతని సెక్యురిటీ మీద ఎమ్మెల్యే కొడుకు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సోను నిగమ్‌కు గాయాలు అవ్వడంతో హాస్పిటల్‌లో చేర్పించారు.

చెంబూరులో శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ ఫతెర్‌పేకర్‌ కొడుకు బాలీవుడ్ సింగర్ మీద చేసిన దాడికి సంబంధించిన ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనిలో ఇప్పుడ రాజకీయ కోణం కూడా బయటకు వచ్చింది. శివసేన రౌడీయిజం చేస్తోందంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. సెలెబ్రిటీలకే రక్షణ లేకపోతే సాధారణ జనాలకు రక్షణ ఎక్కడ ఉంటుందని నిలదీస్తున్నారు. వెంటనే అతడ్ని అరెస్ట్ చేయాలని నెటిజన్లు ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.

 

ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతూనే ఉన్నాయి. గతంలోనూ ఇలానే ఓ సారి సిధ్ శ్రీరామ్‌ మీద దాడి జరిగింది. అంతకు ముందు రాహుల్ సిప్లిగంజ్‌ మీద కూడా ఈ తరహాలోనే దాడి జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బంధువులు అంటూ పబ్‌లో హల్చల్ చేయడం, రాహుల్ సిప్లిగంజ్ వెంట వచ్చిన అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, దీంతో సదరు మాస్ సింగర్ బూతులతో రెచ్చిపోవడం, ఆ గొడవ తారా స్థాయికి చేరడం, రాహుల సిప్లిగంజ్ తల మీద బీరు బాటిల్స్‌తో దాడి చేయడం అందరికీ తెలిసిందే. 

చివరకు ఆ గొడవ సద్దుమణిగినట్టుంది. పోలీస్ స్టేషన్ మెట్ల వరకు ఆ ఇష్యూ వెళ్లింది. తాను అస్సలు వెనక్కి తగ్గను అని రాహుల్ అన్నాడు. కానీ చివరకు సైలెంట్ అయిపోయాడు. టీఆర్ఎస్ పెద్దలు ఇన్వాల్వ్ అవ్వడంతో రాహుల్ కాస్త శాంతించినట్టుగా అప్పట్లో టాక్ వచ్చింది. మరి ఇప్పుడు సోను నిగమ్‌ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం

Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More