Home> వినోదం
Advertisement

Sonal Chauhan Injured: షూటింగ్లో నాగ్ హీరోయిన్ కి గాయాలు.. అసలు ఏమైందంటే?

Sonal Chauhan Injured in 'The Ghost' Action Sequence: హీరోయిన్ సోనాల్ చౌహాన్ ది ఘోస్ట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కోసం సాధన చేస్తూ ఉండగా ఆమె కాలు విరిగిందట.

Sonal Chauhan Injured: షూటింగ్లో నాగ్ హీరోయిన్ కి గాయాలు.. అసలు ఏమైందంటే?

Sonal Chauhan Injured in 'The Ghost' Action Sequence: హీరోయిన్ సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆమె డెడికేషన్ గురించి తెలియజెప్పే విధంగా తాజాగా ఒక విషయం తెర మీదకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే ఆమె ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న ది ఘోస్ట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక అనూహ్య ఘటన జరిగిందని తెలుస్తోంది.

అదేంటంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కోసం సాధన చేస్తూ ఉండగా ఆమె కాలు విరిగిందట. అయితే ఈ దెబ్బతో సుమారు ఆరు వారాల పాటు షూటింగ్ అలాగే ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ కి దూరంగా ఉండాలని ఆమెకు వైద్యం చేసిన వైద్యులు సూచించారు. అయితే ది ఘోస్ట్ సినిమా దసరాకి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో తన శరీరం కష్టపడినా పర్వాలేదు అని భావించి ఆమె తన ఫ్రాక్చర్ తోనే యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేసిందట.

ఇక అలా గాయాలతో ఉన్న సోనాలి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైద్యులు సలహాలను సైతం పక్కనపెట్టి సినిమా కోసం తన డెడికేషన్ చూపించి ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి తర్వాత నటిగా మారింది. హిందీలో జన్నత్ అనే సినిమాతో హీరోయిన్ గా మారిన ఆమె అదే ఏడాది రెయిన్బో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఆ తర్వాత హిందీలో అనేక సినిమాలు చేసింది కానీ ఆమెకు అవేవీ కలిసి రాలేదు. ఇక తెలుగులో  ఆమెకు లెజెండ్ సినిమా మాత్రమే కలిసి వచ్చింది. ఆ తర్వాత పండగ చేసుకో, షేర్, సైజ్ జీరో, రూలర్ ఎఫ్ త్రీ వంటి సినిమాల్లో ఆమె కనిపించింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో రూపొందుతున్న ది ఘోస్ట్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా ఆయన సహచరిగా ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ కనిపించనుంది. 

Also Read: JR NTR vs Ram Charan: ఆస్కార్ బరిలో రామ్ చరణ్ కంటే ఎన్టీఆరే బెటర్!

Also Read: Rajnath Singh Met Prabhas: అన్నా అనేవాడిని.. ఆరోజే వద్దామనుకున్నా కానీ కుదరలేదు..రాజ్ నాద్ సింగ్ ఎమోషనల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More