Home> వినోదం
Advertisement

SIR Movie first weekend: మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. తెలుగులో ధనుష్ రాచ్చరంబోలా!

SIR Movie Collections: ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయగా మొదటి వీకెండ్ లోనే మంచి వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ చేసింది, ఆ వివరాలు

SIR Movie first weekend: మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. తెలుగులో ధనుష్ రాచ్చరంబోలా!

SIR Movie Collections: ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయగా వాతి అనే పేరుతో అదే సినిమాని తమిళంలో కూడా రిలీజ్ చేశారు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించబడిన ఈ సినిమాని రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. ఇక ఈ సినిమా రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేయడం హాట్ టాపిక్ గా మారింది.

సార్ సినిమా మూడవ రోజు గ్రాస్ వసూళ్లు విషయానికి వస్తే నైజాం ప్రాంతంలో రెండు కోట్ల 36 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లా 55 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లా పాతిక లక్షలు, కృష్ణా జిల్లా యాభై ఐదు లక్షలు, నెల్లూరు జిల్లా 18 లక్షలు, గుంటూరు జిల్లా 49 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 83 లక్షలు, వైజాగ్ ప్రాంతంలో 82 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా షేర్ వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా తెలుగులో ఓవరాల్ బిజినెస్ 5 కోట్ల 50 లక్షలు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్గా 6 కోట్లు నిర్ణయించారు.

అయితే రెండు రోజులకే ఈ సినిమా ఐదు కోట్ల 80 లక్షల షేర్ వసూళ్లు రాబట్టడంతో 20 లక్షలు వసూలు చేస్తే హిట్ అవుతుందని అన్నారు. ఇప్పుడు 20 లక్షలు వసూలు చేయడమే కాదు మూడవరోజు పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమా మూడు రోజుల్లోనే హిట్ స్టేటస్ సాధించినట్లు అయింది. మొదటి వీకెండ్ తెలుగులో 15 కోట్ల 7 లక్షలు గ్రాస్, 8 కోట్ల అరవై లక్షల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ జరిగిందని బ్లాక్ బస్టర్ దిశగా సినిమా దూసుకుపోతుందని తెలుస్తోంది.

ఈ రోజు నుంచి సోమవారం కావడంతో వచ్చే వసూళ్లన్నీ కూడా సినిమాకు అదనపు బలంగా మారబోతున్నాయి. ఒక రకంగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఆచితూచి అడుగు వేసి ఫిబ్రవరి 17వ తేదీన సినిమాలు విడుదల చేయగా అది బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. ఒకపక్క షెహజాదా? సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ కి దెబ్బ వేసినా ఈ సినిమా మాత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతూ ఉండటం గమనార్హం.

Also Read: Taraka Ratna Death: ఆ ఒక్కడు లేకుంటే బాబు, లోకేష్ ఆ మరకతోనే జీవించాల్సి వచ్చేది!

Also Read: Balakrishna Taraka Ratna Family: తారక రత్న కుటుంబం విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 
Read More