Home> వినోదం
Advertisement

సిల్లీ ఫెలోస్ ప్రొమోషనల్ వీడియో సాంగ్

సిల్లీ ఫెలోస్ ప్రొమోషనల్ వీడియో సాంగ్

సిల్లీ ఫెలోస్ ప్రొమోషనల్ వీడియో సాంగ్

అల్లరి నరేష్, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిల్లీ ఫెలోస్ సినిమా ఈ నెల 7న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఓ ప్రమోషనల్ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది. అల్లరి నరేష్‌కి గతంలో సుడిగాడు సినిమాతో సూపర్ హిట్ అందించిన భీమనేని శ్రీనివాస రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్ర శుక్ల, పూర్ణ, నందిని రాయ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, చలపతి రావు, అదుర్స్ రఘు, ఝాన్సీ, హేమ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

తమ సినిమాలో కామెడి, ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని చెబుతూ తాజాగా చిత్ర యూనిట్ ఈ ప్రొమోషనల్ సాంగ్‌ని విడుదల చేసింది. 
 

Read More