Home> వినోదం
Advertisement

Shivamogga Subbanna dies: ప్రముఖ గాయకుడు శివమొగ సుబ్బన్న కన్నుమూత

Shivamogga Subbanna dies: గుండెపోటుతో ప్రముఖ గాయకుడు, నేషనల్‌ అవార్డు గ్రహీత శివమొగ సుబ్బన్న మరణించారు. గత కొంతకాలంగా జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్‌(బెంగళూర్) అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి గుండె పోటుకు గురయ్యారు.

Shivamogga Subbanna dies: ప్రముఖ గాయకుడు శివమొగ సుబ్బన్న కన్నుమూత

Shivamogga Subbanna dies: గుండెపోటుతో ప్రముఖ గాయకుడు, నేషనల్‌ అవార్డు గ్రహీత శివమొగ సుబ్బన్న మరణించారు. గత కొంతకాలంగా జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్‌(బెంగళూర్) అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి గుండె పోటుకు గురయ్యారు. కర్ణాటక నుంచి  శివమొగ సుబ్బన్న మొదటి సారిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 1978లో ఆయన (కాదు కుద్రే ఒడి బండిట్టా) అనే పాటకు జాతీయ అవార్డు లభించింది. శివమొగకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  అభిమానుల సందర్శనార్థం ఆయన  పార్థీవదేహాన్ని బెంగళూర్‌లోని రవీంద్ర కళాక్షేత్రంలో ఉంచనున్నారు.

ఆయన సీని పరిశ్రమకు రాక ముందు  జి. సుబ్రమణ్యంగా పిలిచే వారు. అయితే అభిమానులనులే ఆయనను ప్రేమగా  శివమొగ సుబ్బన్న అని పిలిచేవారని సమాచారం. సుబ్బన్న  శివమొగ్గ జిల్లాలోని 1938లో జన్మించారు. ఆయన ప్రేక్షకులకు వేలాది పాటలను అందించి తనదైన శైలి అందుకున్నారు. శివమొగ  సుబ్బన్న  తాగా శ్యామన్న సంగీతంలో ఆరి తేలినవారు. ఆయన సంగీతంపై మక్కువతోనే ఈ రంగ ప్రవేశం చేశారని చాలా సార్లు తెలిపారు.

ఎనలేని పట్టును  శాస్త్రీయ సంగీతంలో సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఆయన కొంతకాలం న్యాయవాదిగా కూడా పని చేశారని సమాచారం. అయితే సంగీతంపై ఉన్న ప్రేమతోనే ఆ న్యాయవాది వృత్తిని వదిలేశారు. కన్నడ భాషలోనే కాకుండా చాలా భాషాల్లో తన గొంతును వినిపించి చిత్ర ప్రపంపంచంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

 కన్నడ పరిశ్రమకు  ‘కరిమాయి’ అనే చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత చాలా చిత్రాలకు తన గొంతు అందించి పాటలు పడారు. 1979లో రజత కమలం అవార్డును రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి చేతుల మీదుగా తీసుకున్నారు. ఈ అవార్డు ఆయనకు చాలా గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన చాలా అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా కర్ణాటక ప్రభుత్వం సుబ్బన్నకు ప్రత్యేక గుర్తింపును కూడా ఇచ్చింది.

Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం

Read also: Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్.... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More