Home> వినోదం
Advertisement

Aadavallu Meeku Johaarlu Teaser: శర్వానంద్‌ను ఎవరు చేసుకుంటారో కానీ చాలా లక్కీ అంటోన్న రష్మిక!

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌, సాంగ్స్ అన్నింటికీ విశేష ఆదరణ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ఆద్యంతం అలరిస్తోంది.

Aadavallu Meeku Johaarlu Teaser: శర్వానంద్‌ను ఎవరు చేసుకుంటారో కానీ చాలా లక్కీ అంటోన్న రష్మిక!

Sharwanand, Rashmika Mandanna Movie: శర్వానంద్‌, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం "ఆడవాళ్లు మీకు జోహార్లు". కిశోర్‌ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 25వ తేదీన రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ నుంచి ఇప్పటికే ఒక పాట రిలీజ్‌ అయి మంచి ఆదరణ పొందింది. 

ఇక తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు టీజర్‌‌ రిలీజ్‌ అయింది. జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం.. అనే శర్వా డైలాగ్‌తో స్టార్ట్ అయ్యే టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

శర్వానంద్, రష్మికల పెళ్లి సంబంధించిన సీన్స్‌తో టీజర్ మొత్తం నడుస్తుంది. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో కానీ చాలా లక్కీ అండి అంటూ రష్మిక చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఇక శర్వానంద్.. వెన్నెల కిషోర్‌‌ మధ్య వచ్చే సీన్స్‌ కూడా అదిరిపోయాయి. 

పెళ్లి కోసం శర్వానంద్ పడే తిప్పలన్నింటినీ టీజర్‌‌లో చూపించారు. టీజర్‌‌ను బట్టీ మూవీ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైన్‌మెంట్‌ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. టైటిల్‌కు తగ్గట్లుగానే మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉన్న స్టోరీతో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ తెరకెక్కింది. మూవీలో శర్వానంద్‌, రష్మిక జోడీ అందరినీ అలరించేలా ఉంది. 

ఇక "పెళ్లి అయినా, పండగ అయినా, మన చిరు జీవితం అయినా, సందడి అంతా ఆడవాళ్లదే" అంటూ శర్వానంద్ టీజర్‌‌ను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు.

చెరుకూరి సుధాకర్‌ నిర్మించిన ఈ మూవీలో ఖుష్బూ, ఊర్వశి, రాధిక శరత్‌కుమార్‌‌లాంటి సీనియర్‌‌ నటీమణులు నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు. ఇక మూవీకి సంబంధించిన నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు భారీ రేట్‌కే అమ్ముడ‌య్యాయట. సోనీ లివ్ వీటిని 25 కోట్ల‌ రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Samantha: సమంతతో ఆడిపాడనున్న టీమిండియా క్రికెటర్!!

Also Read: Ratan Tata: రతన్‌ టాటాను 'ఛోటూ' అన్న అమ్మాయి.. వ్యాపార దిగ్గజం ఏం రిప్లై ఇచ్చారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More