Home> వినోదం
Advertisement

Aditi rao Hydari- Siddharth: సిద్దార్థ్-అదితీ రావు హైదరీ రిలేషన్ పై ఓపెన్ అయిన శర్వా.. ఏమో పలికిందేమో అంటూ!

Sharwanand Interesting Comments: సిద్దార్థ్-అదితీ రావు హైదరీ రిలేషన్ పై  శర్వానంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు, తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే 

Aditi rao Hydari- Siddharth: సిద్దార్థ్-అదితీ రావు హైదరీ రిలేషన్ పై ఓపెన్ అయిన శర్వా.. ఏమో పలికిందేమో అంటూ!

Sharwanand Comments on Aditi rao Hydari- Siddharth Relation: గత కొద్ది రోజుల క్రితం యంగ్ హీరో సిద్దార్థ్ అదితీరావు హైదరి పుట్టినరోజు సందర్భంగా తన హృదయపూర్వక యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఒక పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ కలిసి గతంలో మహాసముద్రం అనే సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసిందని అనేక ప్రచారాలు ఉన్నాయి, కానీ మొట్టమొదటిసారిగా సిద్దార్థ్ ధైర్యంగా ఇలా కామెంట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఊపందుకుంది.

తాజాగా అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్బీకే సెకండ్ సీజన్ నాలుగో ఎపిసోడ్లో పాల్గొన్న శర్వానంద్ మీద కూడా ఇదే ప్రశ్న సంధించారు. బాలకృష్ణ సాధారణంగా మీరు హీరోయిన్లను ఎలా ఎంచుకుంటారని శర్వానంద్ ను బాలకృష్ణ ప్రశ్నించారు దానికి శర్వానంద్ నాదేమీ లేదని నా దర్శకులు ఎలా చెబితే అలా చేయడం తప్ప నేను స్పెషల్ గా ఏమి సెలెక్ట్ చేసుకోమని చెప్పుకొచ్చారు. మరి అదితి రావు హైదరీ పరిస్థితి ఏమిటంటే ఆవిడ మహా సముద్రం సినిమాలో నాకు జంటగా నటించలేదు.

సిద్ధార్థ్ జంటగా నటించిందని శర్వానంద్ చెప్పుకొచ్చారు. దానికి బాలయ్య అంటే సినిమాలో మీకు జంటగా నటించింది, రియల్ లైఫ్ లో మాత్రం సిద్ధార్థకి జంటగా మారిందా అని ప్రశ్నించారు. నాకు తెలియదన్న శర్వానంద్ తర్వాత మాత్రం ఇలా ఇంస్టాగ్రామ్ లో తన హృదయపూర్వక యువరాణి కామెంట్ చేశారని, అందువల్ల తాను ఇలా మాట్లాడుతున్నానని శర్వానంద్  చెప్పుకొచ్చారు. అంటే పలికిందంటావా అనే బాలకృష్ణ అడగటం దానికి ఏమో పలికిందేమో అని శర్వా చెప్పడం కూడా నవ్వులు పూయించాయి.

అంటే ఆ అమ్మాయి ఏమైనా నీతో చెప్పిందా అని బాలకృష్ణ ప్రశ్నిస్తే అమ్మో అలాంటిదేమీ చెప్పలేదని శర్వానంద్ చెప్పుకొచ్చారు ఇక హైదరాబాద్ రాజవంశానికి చెందిన అదితీరావు హైదరీ చాలా కాలం క్రితమే బాలీవుడ్లో హీరోయిన్ గా లాంచ్ అయింది. ఆ తర్వాత తెలుగులో సరైన హిట్టు కోసం ప్రయత్నించిన ఆమె సమ్మోహనం సినిమాతో హిట్టు అందుకుంది. కానీ తర్వాత మరో హిట్ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తోంది.

Also Read: Anudeep KV Comments: గాడ్ ఫాదర్ బోరింగ్ సినిమా అంటూ అనుదీప్ షాకింగ్ కామెంట్స్.. ఛీఛీ అంటూ!

Also Read: Sharwanand to Balakrishna: శర్వానంద్ డబుల్ మీనింగ్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More