Home> వినోదం
Advertisement

సమంతతో చేసిన సినిమానే శైలజారెడ్డి అల్లుడు ప్రమోషన్స్‌కి వాడుకుంటున్న చైతూ

శైలజారెడ్డి అల్లుడు మూవీ డైలాగ్ ప్రోమో

సమంతతో చేసిన సినిమానే శైలజారెడ్డి అల్లుడు ప్రమోషన్స్‌కి వాడుకుంటున్న చైతూ

అక్కినేని నాగచైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా, సమంత ప్రధాన పాత్ర పోషించిన యూ టర్న్ సినిమా సెప్టెంబర్ 13న ఒకేరోజు విడుదల కానున్న నేపథ్యంలో ఇరు చిత్ర యూనిట్ వర్గాలు తమదైన స్టైల్లో తమతమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా యూ టర్న్ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత ఫేస్‌బుక్ కార్యాలయం నుంచి లైవ్‌లో పాల్గొని అభిమానులతో కాసేపు సరదాగా లైవ్ చిట్ చాట్ చేస్తూ వారి సందేహాలకు సమాధానాలిచ్చారు. 

ఇక శైలజారెడ్డి అల్లుడు సినిమా విషయానికొస్తే, మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ప్రోమోను విడుదల చేశారు. గతంలో చైతూ, సమంత ఇద్దరూ కలిసి నటించిన ఏ మాయ చేశావే సినిమా ఎంత సూపర్ హిట్టో అందరికీ తెలిసిందే. అందుకే శైలజారెడ్డి అల్లుడు సినిమాలో ఏ మాయ చేశావే సినమాపై రాసిన డైలాగ్‌నే తాజాగా మేకర్స్ తమ ప్రమోషన్స్‌కి ఉపయోగించుకున్నారు. అక్కినేని అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోన్న ఆ డైలాగ్ ఇదే.

Read More