Home> వినోదం
Advertisement

Shahrukh Khan Stopped: చిక్కుల్లో స్టార్ హీరో.. గంట పాటు ఎయిర్ పోర్టులో నిలిపేసి ప్రశ్నించిన అధికారులు?

Shahrukh Khan At Mumbai Airport: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది.  ఆయనని అధికారులు గంట పాటు నిలిపివేసినట్టు తేలుతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Shahrukh Khan Stopped: చిక్కుల్లో స్టార్ హీరో.. గంట పాటు ఎయిర్ పోర్టులో నిలిపేసి ప్రశ్నించిన అధికారులు?

Shahrukh Khan Stopped At Mumbai Airport: షారుక్‌ ఖాన్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ ఒకటి ఆలస్యంగా బయటకు వచ్చింది.  కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను బాలీవుడ్ 'కింగ్' షారూఖ్ ఖాన్‌ను ముంబై విమానాశ్రయంలో శుక్రవారం అర్థరాత్రి అధికారులు నిలిపివేశారు. అసలు విషయం ఏమిటంటే ఒక షూట్ నిమిత్తం షార్జా వెళ్లిన షారుఖ్ షారూఖ్ ఖాన్ తన బృందంతో తిరిగి వచ్చారు. ఆ సమయంలో కస్టమ్ డిపార్ట్‌మెంట్ అధికారులు షారుక్ అలాగే అతని టీమ్ మొత్తాన్ని ఆపడమే కాకుండా, నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై దాదాపు గంటసేపు విచారించారని అంటున్నారు.

షారుక్ సహా ఆయన మేనేజర్ పూజా దద్లానీ ఏకంగా ఒక గంట తర్వాత విమానాశ్రయం నుంచి నిష్క్రమించడం కనిపించిందని అంటున్నారు. వారు ఇద్దరూ బయటకు వచ్చినా సరే షారుఖ్ బాడీగార్డ్ రవి అండ్ టీమ్ ను మాత్రం అధికారులు వదల్లేదు. లక్షల రూపాయల విలువైన వాచీలను భారత్‌కు తీసుకురావడం, వాటికి కస్టమ్ డ్యూటీ చెల్లించకపోవడం వంటి చర్యలకు షారుఖ్ టీమ్ పూనుకుందని చెబుతున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఉదయం 5 గంటల ప్రాంతంలో రూ.6.83 లక్షల జరిమానా చెల్లించడంతో షారుఖ్ ఖాన్ టీమ్ అందరినీ విడుదల చేశారు. 

ఎక్కడి నుంచి వచ్చారు?
విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, షారుక్ ఖాన్ తన టీమ్ తో కలిసి ప్రైవేట్ చార్టర్ VTR-SG ద్వారా ముంబైకి తిరిగి వచ్చారు. దుబాయ్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన వెళ్లి వచ్చారని తెలుస్తోంది. ముంబైలో ల్యాండ్ అయిన తరువాత తెల్లవారుజామున 12.30 గంటలకు విమానాశ్రయంలోని టి3 టెర్మినల్ వద్ద రెడ్ ఛానల్ దాటుతుండగా, కస్టమ్ అధికారులు అనుమానం వచ్చి చెక్ చేయడంతో షారుక్ సహా అతని టీమ్ బ్యాగ్స్ లో సుమారు 18 లక్షల రూపాయల విలువైన ఖరీదైన యాపిల్ సహా వివిధ బడా కంపెనీలకు చెందిన వాచీలను కనుగొన్నారు. వారి బ్యాగ్‌స్ లో చాలా వాచ్‌ల ఖాళీ పెట్టెలు కూడా ఉన్నాయని, వీటిలో ఏ ఒక్క దానికీ కస్టమ్ డ్యూటీ చెల్లించలేదని తేల్చారు. ఈ క్రమంలో షారూఖ్ ఆయన టీమ్ ను విచారణ కోసం కూర్చోబెట్టారు.

తర్వాత ఏం జరిగిందంటే?
 ఒక గంట విచారణ అనంతరం షారుఖ్, ఆయన మేనేజర్ పూజ అక్కడి నుంచి నిష్క్రమించారు. అందుతున్న సమాచారం మేరకు షారుఖ్ టీమ్ నుంచి 6 బాక్సుల రోలెక్స్ వాచీలు, రూ. 8 లక్షల విలువైన ఒక ఎస్పిరిట్ బ్రాండ్ వాచ్, యాపిల్ సిరీస్ వాచీలు అలాగే ఇవి కాక బాబున్ & జుర్బ్‌కె వాచీలు కూడా దొరికాయని అంటున్నారు. ఆ వాచీల మొత్తం ఖరీదు రూ.17 లక్షల 56 వేల 500 అని కస్టమ్స్ విభాగం గుర్తించడంతో కస్టమ్స్ క్లియర్ చేసేవరకు విచారణ చేశారు.

షారుఖ్ తన మేనేజర్ తో వెళ్ళిపోయాక షారుఖ్ బాడీగార్డ్ రవి కస్టమ్ డ్యూటీ మొత్తం చెల్లించినట్లు కస్టమ్ నుంచి సమాచారం. ఇక అందుతున్న సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవి రూ.6 లక్షల 83 వేలు కస్టమ్స్ చెల్లించాడు. అయితే ఆ డబ్బు కూడా షారుఖ్ ఖాన్ క్రెడిట్ కార్డ్ నుండి చెల్లించినట్లు తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే చివరగా ఆయన బ్రహ్మాస్త్ర అనే సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో నటించారు. ఇక ఆయన 'పఠాన్', ‘జవాన్‌’ అలాగే 'డంకీ' అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?

Also Read: Samantha Stardom: చైతూ, నాగార్జునలను చిత్తు చేసిన సమంత... తొక్కుకుంటూ పోవాలంటున్న ఫాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More