Home> వినోదం
Advertisement

Shahid Kapoor: ఆమెతో కలిసి నటించడమే నా కల: షాహిద్ కపూర్

Shahid Kapoor:  ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇందులో సమంత యాక్టింగ్ వేరే లెవల్ అనే చెప్పాలి. తాజాగా ఆమె నటనపై స్పందించాడు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్. ఏం చెప్పాడంటే..

Shahid Kapoor:  ఆమెతో కలిసి నటించడమే నా కల: షాహిద్ కపూర్

Shahid Kapoor:  ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ లో సమంత నటనకు చాలా మంది ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు సెలబ్రిటీలు సైతం ఉన్నారు. తాజాగా సమంతపై బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం ట్విటర్‌లో లైవ్‌ సెషన్‌ నిర్వహించి అభిమానులతో ముచ్చటించాడు షాహిద్‌. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో షాహిద్‌ రాజ్‌ అండ్‌ డీకేలతో కలిసి చేసిన తన వెబ్‌ సిరీస్‌, జెర్సీ మూవీలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. 

ఈ నేపథ్యంలో ఓ అభిమాని ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’(The Family Man‌ 2) వెబ్‌ సిరీస్‌ గురించి అడిగాడు. దీంతో షాహిద్‌ ఈ వెబ్‌ సిరీస్‌ తనకు బాగా నచ్చిందని ముఖ్యంగా ఇందులో సమంత(Samantha) నటనకు ఫిదా అయ్యానని చెప్పాడు. అంతేగాక ‘ఈ సిరీస్‌ చూస్తున్నంత సేపు తనతో, తన నటనతో ప్రేమలో పడిపోయాను. చెప్పాలంటే ఈ షో మొత్తంలో సమంత నటన నన్ను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆమెతో కలిసి నటించాలనే ఆసక్తి పెరిగింది. ఇప్పుడు తనతో ఓ సినిమా చేయడమే నా కల’ అంటూ సామ్‌పై షాహిద్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

Also Read: Liger Movie Update: విజయ్ దేవరకొండ 'లైగర్’ సినిమాలో ఐరన్ మైక్ టైసన్

కాగా రాజ్‌-డీకే దర్శకత్వలో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’లో సమంత నెగిటివ్‌ షెడ్స్‌ ఉన్న రాజీ(Raji) పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్‌ కూడా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం షాహిద్‌ సినిమాల విషయానికొస్తే.. రాజ్‌ అండ్‌ డీకేలతో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేశాడు. ఈ సిరీస్‌ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. అలాగే అతడు నటించి జెర్సీ(Jersy) మూవీ రీమేక్‌ కూడా షూటింగ్‌ పూర్తి చేసుకుందని, ఈ ఏడాది డిసెంబర్ 31 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు షాహిద్‌ చెప్పుకొచ్చాడు. మ‌రోవైపు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా 'శాకుంత‌లం(Shakunthalam)'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

pple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More