Home> వినోదం
Advertisement

Shah Rukh Khan : పెళ్లి వద్దు కానీ డేట్‌కు వస్తావా?.. ఫ్యాన్‌ రిక్వెస్ట్‌పై షారుఖ్ ఫన్నీ రిప్లై

Shah Rukh Khan ASK SRK షారుఖ్ ఖాన్ ప్రస్తుతం మీడియాలో కంటే సోషల్ మీడియాలోనే ఉంటున్నాడు. సోషల్ మీడియాతోనే ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. అభిమానులు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు.

Shah Rukh Khan : పెళ్లి వద్దు కానీ డేట్‌కు వస్తావా?.. ఫ్యాన్‌ రిక్వెస్ట్‌పై షారుఖ్ ఫన్నీ రిప్లై

Shah Rukh Khan ASK SRK షారుఖ్ ఖాన్ తన పఠాన్ సినిమా కోసం మీడియా ముందుకు రాలేదు. ఎక్కడా ప్రమోషన్స్ చేయలేదు. సినిమా రిలీజ్‌కు ముందు ఏ హడావిడి చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చట్లు పెడుతూ ఉండేవాడు. ASK SRK పేరిట షారుఖ్ తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పడు మరోసారి షారుఖ్ నెటిజన్లతో ముచ్చట్లు పెట్టేశాడు. ఇందులో ఆయన్ను రకరకాల ప్రశ్నలు వేసేస్తున్నారు అభిమానులు.

మీరు పదే పదే నా కలలోకి వస్తున్నారు.. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇకపై ఆపేయండి.. నా కల్లోకి రాకండి.. అని అనేశాడు. దీంతో షారుఖ్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. మీరు నిద్రపోవడం ఆపేయండి.. నేను కూడా కల్లోకి రాను అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అయితే షారుఖ్ తన పఠాన్ సినిమా సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు.

అసలే ఈ సినిమా రోజుకు వంద కోట్ల వరకు కొల్లగొట్టేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల గ్రాస్‌ను రాబట్టేసింది. చూస్తూ ఉంటే.. ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు వసూల్ చేసేలానే కనిపిస్తోంది. ఇప్పుడు షారుఖ్ తన పఠాన్ సినిమాతో బాలీవుడ్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేశాడు.

 

షారుఖ్ ఫ్యాన్స్ మాత్రం పఠాన్‌ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఇలా అడిగింది. పెళ్లి అని అడగను గానీ ఓ రోజు డేట్‌కు వెళ్దామా? అని అడిగేసింది. నేను డేట్ విషయంలో బోరింగ్‌గా అనిపిస్తాను.. నువ్వే ఓ కూల్ గాయ్‌ను చూసుకుని డేట్‌కు వెళ్లు.. ఆ రోజు పఠాన్ సినిమాను చూడండి అని తన సినిమాను కూడా ప్రమోట్ చేసేసుకున్నాడు షారుఖ్.

Also Read:  Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?

Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More