Home> వినోదం
Advertisement

Kaikala Satyanarayana Death : నటుడు కైకాల కన్నుమూత

Kaikala Satyanarayana Death నటుడు కైకాల సత్యనారాయణ (87) నేటి ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాసవిడిచారు.
 

Kaikala Satyanarayana Death : నటుడు కైకాల కన్నుమూత

Kaikala Satyanarayana Death ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) నేటి ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాసవిడిచారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక కైకాల తెలుగు వారికి యముడిగా సుపరిచితుడు. ఎన్నో సినిమాల్లో యమధర్మరాజుగా కనిపించి మెప్పించాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు. విలనిజంలో కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. కామెడీ, ఎమోషన్ ఇలా ఏ పాత్రను ఇచ్చినా కూడా ఆయన తన పూర్తి న్యాయం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి.. ఇప్పటి తరం హీరోలతోనూ పని చేశారు. చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీ సినిమాల్లో ఆయన ఎక్కువగా నటించారు.

మహేష్‌ బాబు, ప్రభాస్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ వంటి హీరోలతోనూ ఆయన నటించారు. చివరగా ఆయన మహర్షి సినిమాలో నటించారు. అయితే కైకాల ఇప్పుడు అస్తమవ్వడంతో తెలుగు చిత్ర సీమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. చివరగా కైకాల బర్త్ డేను చిరంజీవి సెలెబ్రేట్ చేశాడు.ఆయన బెడ్డు మీద ఉండగానే చిరంజీవి ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించాడు. చిరు అలా తన బర్త్ డేను సెలెబ్రేట్ చేయడంతో కైకాల మురిసిపోయారు. చిరునవ్వులు చిందిస్తున్న ఆ ఫోటోలు సైతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అయ్యాయి.

ఈ ఏడాది వరుసగా విషాదాలు చోటు చేసుకున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ కుంగిపోయి ఉంటే.. ఇప్పుడు ఇలా కైకాల మరణంతో మరింతగా విషాదంలోకి నెట్టినట్టు అయింది.

Also Read : Dhamaka Twitter Review : ధమాకా ట్విట్టర్ రివ్యూ.. అవుట్ డేటెడ్ స్టోరీ కానీ!

Also Read : 18 Pages Movie Twitter Review: 18 పేజెస్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More