Home> వినోదం
Advertisement

Kalki 2898 AD: కల్కి సినిమాలో ప్రభాస్ స్క్రీన్ టైం ఎంతో తెలుసా.. ఎవరెవరు ఎంతసేపు కనిపించారంటే !

Kalki 2898 AD Day Wise Collections: ప్రభాస్.. నాగ అశ్విన్.. కాంబినేషన్ లో విడుదలైన కల్కి 2898 AD..సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. రికార్డులు సృష్టిస్తోంది. అయితే భారీ తయారవడంతో తెరకెక్కిన..ఈ సినిమాలో..ఎవరెవరు ఎంతసేపు కనిపించారో తెలుసా? తెలియాలంటే ఇదొకసారి చదవాల్సిందే..

Kalki 2898 AD: కల్కి సినిమాలో ప్రభాస్ స్క్రీన్ టైం ఎంతో తెలుసా.. ఎవరెవరు ఎంతసేపు కనిపించారంటే !

Kalki 2898 AD Day 2 Collections: 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా.. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డులు మోత మోగిస్తోంది. ఈ సినిమా గురించిన.. చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా.. మారుతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి.. బోలెడు స్పాయిలర్స్ బయటకు వచ్చేసాయి. 

ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో చాలామంది స్టార్ నటీనటులు.. నటించారు. దీపిక పడుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇలా చాలా మంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో.. కనిపించారు. సినిమా ఎంత మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సినిమాలో కొన్ని విషయాలు నచ్చలేదని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

ముఖ్యంగా ప్రభాస్ తెరమీద.. కనిపించింది సమయం.. తక్కువగా.. ఉందని ప్రభాస్ కంటే అమితాబ్ బచ్చన్ పాత్ర ఎక్కువగా హైలైట్ అవుతుంది అంటూ ఎన్నో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఎవరెవరు ఎంతసేపు స్క్రీన్ మీద కనిపిస్తారో తెలుసా. 

సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో.. కమల్ హాసన్ ఈ సినిమాలో కనిపించేది కేవలం 7 నిమిషాల 4 సెకండ్లు మాత్రమే. అయినప్పటికీ కమల్ హాసన్.. నటన పరంగా ఇచ్చిన ఇంపాక్ట్ ఇంకా ప్రేక్షకుల కళ్ళముందే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. దిశా పటాని.. ఈ సినిమాలో పది నిమిషాల 24 సెకండ్లు కనిపిస్తుంది. ప్రభాస్ కి ఈమె పాత్రకి మధ్య ఒక పాట కూడా ఉంటుంది. 

మెయిన్ హీరోయిన్ అయినా దీపికా పడుకొనే.. ఈ సినిమాలో 23 నిమిషాల 42 సెకండ్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో దీపిక పడుకొనే.. నటన ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ చాలావరకు ఫైట్ సీన్స్ లోనే కనిపిస్తారు. ఆయన స్క్రీన్ టైమ్ 25 నిమిషాల 19 సెకండ్లు. 

ఇక సినిమాలో మెయిన్ హీరో ప్రభాస్ వెండి తెర మీద.. ఒక గంట రెండు నిమిషాల 25 సెకండ్లు కనిపిస్తారు. కమర్షియల్ సినిమా ప్రకారం గా చూసుకుంటే హీరో పాత్రకి ఇది తక్కువ నిడివి అని చెప్పుకోవచ్చు. కానీ ఇది మామూలు కమర్షియల్ సినిమా కాదు. ప్రభాస్ పాత్ర కనిపించేది.. గంట అయినప్పటికీ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్రభాస్ ఎలివేషన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. 
అయితే కల్కి రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర నిడివి ఇంకా ఎక్కువగానే ఉంటుందని ఆశిస్తున్నారు ప్రేక్షకులు.

Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..

Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More