Home> వినోదం
Advertisement

SVP Song Leak: 'సర్కారు వారి పాట' సాంగ్ లీక్.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

Sarkaru Vari Pata Song Leak: 'సర్కారు వారి పాట' సినిమాలోని కళావతి సాంగ్ సోషల్ మీడియాలో లీకవడం ఆ చిత్ర మేకర్స్‌ని షాక్‌కి గురిచేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మేకర్స్.. లీక్‌కి బాధ్యులైన ఇద్దరిని గుర్తించి పోలీసులకు అప్పగించారు.

SVP Song Leak: 'సర్కారు వారి పాట' సాంగ్ లీక్.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

Sarkaru Vari Pata Song Leak: సూపర్ స్టార్ మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట' నుంచి ఫస్ట్ సింగిల్ లీకవడాన్ని ఆ చిత్ర నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ సీరియస్‌గా తీసుకున్నారు. 'కళావతి' సాంగ్ లీక్‌కి బాధ్యులైన ఇద్దరు వ్యక్తులను గుర్తించి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సాంగ్ లీక్‌పై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌ను వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ నెల 14 విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ భావించారు. కానీ ఇంతలోనే కళావతి పూర్తి లిరికల్ వీడియో యూట్యూబ్‌లో ప్రత్యక్షమవడంతో మేకర్స్ షాక్ తిన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సాంగ్ లీక్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన తమన్.. ఈ బాధను తట్టుకోలేకపోతున్నానని ట్విట్టర్‌లో వాయిస్ మెసేజ్ పోస్ట్ చేశాడు.

'కళావతి' సాంగ్ లీక్‌పై ఇప్పటికైతే మహేష్ బాబు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సాంగ్ ముందే లీకవడంతో వాలెంటైన్స్ డే రోజు విడుదల చేయాల్సిన లిరికల్ వీడియోను.. ఒకరోజు ముందు గానే విడుదల చేయనున్నారు. సాంగ్ లీక్‌తో అప్రమత్తమైన చిత్ర యూనిట్.. మున్ముందు ఎలాంటి కంటెంట్ లీకవకుండా చర్యలు చేపడుతోంది. ఇటీవలే స్పెయిన్‌లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: Vishakapatnam: విషాదం.. కొడుక్కి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ తండ్రి మృతి

Also Read: ఉక్రెయిన్‌పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. పుతిన్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More