Home> వినోదం
Advertisement

Kannappa: కన్నప్పలో శరత్ కుమార్ ఉగ్రరూపం.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్

Kannappa Sarath Kumar: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప చిత్రంపై.. అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ఇప్పటికే భారీ తారాగణం భాగమై.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తి తెప్పించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా నుంచి.. ఒక పాపులర్ నటుడి ఫస్ట్ లుక్ తెగ వైరల్ అవుతుంది.

Kannappa: కన్నప్పలో శరత్ కుమార్ ఉగ్రరూపం.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్

Kannappa Update: విష్ణు మంచు ‘కన్నప్ప’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ముఖ్యంగా ఈ మధ్య విడుదల చేసిన టీజర్‌ కన్నప్ప మీద మరిన్ని అంచనాలను పెంచింది. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యే కన్నప్ప వాడిన విల్లు విశేషాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి.

ఇక ఎప్పుడూ కన్నప్ప నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై.. ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచుతోంది. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా..  ఆయన కారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు సినిమా యూనిట్. ఈ సినిమాలో శరత్ కుమార్ నాథనాధుడిగా కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన ఉగ్రరూపాన్ని మనం చూడొచ్చు. ఓ యోధుడిలా శరత్ కుమార్ ఈ ఫస్ట్ లుక్ లో కనిపించి మెప్పించారు.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ సినిమాని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌తో కన్నప్ప చిత్రం రానుంది. 

మోహన్ లాల్, అక్షయ్ కుమార్,బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌లో  ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Shankar: పాత చింతకాయ పచ్చడిలా మారిన శంకర్ పరిస్థితి.. ఇక గేమ్ చేంజర్ గతి అంతేనా!

Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More