Home> వినోదం
Advertisement

KGF Chapter 2: అధీరా ఫస్ట్ లుక్ విడుదల

Adheera FirstLook: కేజీఎప్ ( KGF ) మూవీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కేజీఎఫ్ చాప్టర్ 2 ( KGF Chapter 2 ) విలన్ అధీరా ఫస్ట్ లుక్ ( Adheera First Look) విడుదలైంది.

KGF Chapter 2: అధీరా ఫస్ట్ లుక్ విడుదల

Adheera FirstLook: కేజీఎప్ ( KGF ) మూవీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కేజీఎఫ్ చాప్టర్ 2 ( KGF Chapter 2 ) విలన్ అధీరా ఫస్ట్ లుక్ ( Adheera First Look) విడుదలైంది. అత్యంత పాశవిక విలన్, జాలి లేని మనిషిగా అధీరా కనిపించనున్నాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకు ముందే తెలిపారు. ఈ మూవీలో సంజయ్ దత్ ( Sanjydutt As Adheera ) అధీరా పాత్ర చేస్తున్నాడు. నేడు సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా అధీరా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు మేకర్స్. కాగా కన్నడ యాంగ్రీయంగ్ మేన్ యష్ ( Yash) నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 ( KGF Chapter 1 ) జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 నిర్మాణ దశలో ఉంది. అక్టోబర్ లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

Read This Story Also:  కుర్రకారు మతి పోగోడుతోన్న టైగర్ ష్రాఫ్ చెల్లెలు కృష్ణా ష్రాఫ్ ఫోటోలు

ఈ భూమిపై క్రూరత్వానికి పరాకాష్ఠ అని ఎవరినైనా అంటే అది అధీరా మాత్రమే అంటున్నాడు దర్శకుడు. విలన్ పాత్ర కోసం వెతుకుతున్న సమయంలో మొదట గుర్తుకు వచ్చింది సంజయ్ దత్ మాత్రమే అంటున్నాడు. కరోనావైరస్ సంక్షోభం వల్ల చిత్రీకరణ కొన్ని నెలలు వాయిదా పడినా.. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Read This Story Also:  IRCTC: ఇక ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం చాలా సులభం

 

Read More