Home> వినోదం
Advertisement

Sadak 2 ట్రైలర్ విడుదల

సడక్ 2 చిత్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంజయ్ దత్  ( Sanjay Dutt ) అభిమానులకు మరో సర్‌ప్రైజ్ తెరపైకి వచ్చింది. ఇటీవలనే సడక్ 2 సినిమాకు సంబంధించి ఫిలింమేకర్స్ మూడు పోస్టర్లను విడుదల చేశారు. అయితే తాజాగా సడక్ 2 ట్రైలర్ (sadak 2 tralier) రిలీజ్ అయింది.

Sadak 2 ట్రైలర్ విడుదల

sadak 2 movie tralier: సడక్ 2 చిత్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంజయ్ దత్  ( Sanjay Dutt ) అభిమానులకు మరో సర్‌ప్రైజ్ తెరపైకి వచ్చింది. ఇటీవలనే సడక్ 2 సినిమాకు సంబంధించి ఫిలింమేకర్స్ మూడు పోస్టర్లను విడుదల చేశారు. అయితే తాజాగా సడక్ 2 ట్రైలర్ ( sadak 2 trailer ) రిలీజ్ అయింది. ఈ సడక్2 సినిమాలో  సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో ఆదిత్యారాయ్‌ కపూర్ (Aditya Roy Kapur)‌, ఆలియా భట్‌ ( Alia Bhatt ) హీరో, హీరోయిన్లుగా మహేశ్‌ భట్‌ తెరకెక్కిస్తున్నారు. అయితే.. 1991లో మహేష్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ మూవీ సడక్‌ 1కు ఇది సీక్వెల్‌ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ చిత్రానికి ముఖేష్ భట్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మహేష్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు.

సడక్‌ (పార్ట్‌-1) లో సంజయ్‌ క్యాబ్‌ నడుపుతున్న సీన్‌ తో షురూ అయ్యే ట్రైలర్‌.. ఉత్కంఠతతో ముందుకు సాగుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంచి, చెడు మధ్య జరిగే సంఘర్షణను ఈ సినిమాలో తెరకెక్కించారు. ఆగస్టు 28న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుదల కానుంది. గతంలోనే విడుదల కావాల్సిన ట్రైలర్‌ కొన్ని కారణాల ఆలస్యమై నిన్న విడుదల కావడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. Also read: Sadak 2: ఒక్కరోజే బ్యాక్ టు బ్యాక్ మూడు పోస్టర్లు విడుదల

ఇదిలాఉంటే.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నిటిస్తున్న సంజయ్‌దత్‌ స్టేజ్‌-3 లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి సంజయ్‌దత్ డిశ్చార్జ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సీక్వెల్‌గా సడక్ 2గా వస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్‌ మరోసారి క్యాబ్‌ డ్రైవర్‌గా ప్రక్షకులను కనువిందు చేయనున్నారు.  Also read: Lung cancer treatment: సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్.. ? అమెరికాలో చికిత్స ?

Read More