Home> వినోదం
Advertisement

Sandeep Kishan: డబుల్ మీనింగ్ ప్రశ్న అడిగిన మహేష్.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన సందీప్ కిషన్

Ooru Peru Bhairavakona : సందీప్ కిషన్ చాలా కూల్ గా ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సందీప్ తనకు చిరాకు తెప్పించిన ఒక కుర్రాడికి కూల్ గా ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియో లో సందీప్ మాటలకి అందరూ ఫీదా అవుతున్నారు.

Sandeep Kishan: డబుల్ మీనింగ్ ప్రశ్న అడిగిన మహేష్.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన సందీప్ కిషన్

Sandeep Kishan Slipper Shot Reply: మీమ్స్,  ట్రోలింగ్ బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ టైంలో ప్రతిదీ వక్రీకరించి మాట్లాడటం ఫ్యాషన్ గా మారిపోతుంది. డబల్ మీనింగ్ వచ్చే మాటలతో ఈవెంట్లలో సెలబ్రిటీలను కొందరు సతాయించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. మామూలు విషయాలని కూడా ఏదో ఉంది అనే అర్ధం వచ్చేలా డబల్ మీనింగ్ గా మాట్లాడి తామేదో హీరోల మని బిల్డప్ ఇచ్చే కుర్రాళ్ళు ఉన్నారు. లేటెస్ట్ గా సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమాకి సంబంధించి ఏర్పాటు చేసిన ఒక మీటింగ్ లో కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. మీటింగ్ లో ఒక  మహేశ్ అనే మీమర్ డబల్ మీనింగ్ గా ప్రశ్నలు అడుగుతూ కాస్త ఎక్స్ట్రాలు చేశాడు. అతనికి చాలా కూల్ గా సందీప్ కిషన్ తీసుకున్న క్లాస్..దానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

 ఈ మధ్యకాలంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కు మీమ‌ర్స్ ను ఆహ్వానించడం ఎక్కువైపోయింది. చిత్ర బృందం వాళ్లతో స్పెషల్గా ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే స్టైల్ ని ఊరు పేరు భైరవకోన చిత్ర బృందం కూడా ఫాలో అయ్యారు. ఈ నేపథ్యంలో మీమ‌ర్స్ తో జరిగిన ఇంట‌రాక్ష‌న్  లో మహేష్ అని ఒక కుర్రాడు కాస్త డబల్ మీనింగ్ వచ్చే విధంగా ప్రశ్నలు అడిగారు. మూవీలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ తో మాట్లాడుతూ అతను ‘మీ పేరు భూమి కదా ?మీ భూమి మాకు రాసిస్తారా?'అంటూ డబల్ మీనింగ్ గా కామెడీ చేశాడు. అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వర్ష కాస్త తట పటాయించినా ..చివరకు ఆ చాన్స్ లేదు వేరే వాళ్లకు ఇచ్చేశాను అంటూ ఘాటుగానే సమాధానం ఇచ్చింది.

 

ఆ తర్వాత మూవీ హీరో సందీప్ కిషన్ తో మాట్లాడిన ఆ కుర్రాడు.. ‘ఇద్దరు హీరోయిన్లతో చేశారు కదా? ఏ హీరోయిన్ తో బాగా అనిపించింది?’అని మళ్ళీ డబల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. అప్పటికే ఆ కుర్రాడు అడిగే ప్రశ్నలకు చిర్రెత్తి ఉన్న సందీప్.. మీ మాతృభాష ఏమిటి? తెలుగులో ఎవరితో అయినా  యాక్ట్ చేసినప్పుడు నటించడం అనే పదాన్ని వాడుతారు. ఎవరితో బాగుంది కాదు.. ఎవరితో నటించడం బాగుంది అని అంటారు.. ముందు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో అని కాస్త ఘాటుగానే అన్నాడు. అంతేకాదు ఇలా డబల్ మీనింగ్ ఆ వచ్చే మాటలు మాట్లాడే పద్ధతి వదులుకోమని స్ట్రైట్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో సందీప్ అతనికి ఇచ్చిన కోటింగ్ కి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ‘భలే చెప్పావు.. సందీప్ భయ్యా..ఇలాంటి వాళ్లకు ఇలాగే చేయాలి’ అని కామెంట్లు కూడా పెడుతున్నారు.

Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌ తప్పదా?

Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్‌ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్‌, రుణమాఫీ ఎప్పటినుంచంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిa

 

 

Read More