Home> వినోదం
Advertisement

Sampoornesh Babu: మార్టిన్ లూథ‌ర్ కింగ్‌గా బర్నింగ్ స్టార్.. డిఫ‌రెంట్‌గా ఫస్ట్ లుక్..

Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నయా మూవీ 'మార్టిన్ లూథ‌ర్ కింగ్'. లాంగ్ గ్యాప్ త‌ర్వాత సంపూ నటిస్తున్న చిత్రం ఇది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
 

Sampoornesh Babu: మార్టిన్ లూథ‌ర్ కింగ్‌గా బర్నింగ్ స్టార్..  డిఫ‌రెంట్‌గా ఫస్ట్ లుక్..

Sampoornesh Babu Upcoming Movie: హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు. తొలి సినిమాతోనే ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ నటుదు. ఆ తర్వాత వచ్చిన కొబ్బరి మట్ట సినిమా కూడా సంపూకు(Sampoornesh Babu) మంచి పేరే తెచ్చి పెట్టింది.  అయితే గత కొనాళ్లుగా సంపూకు సరైన హిట్ లేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు ఈ బర్నింగ్ స్టార్. మళ్లీ ఇప్పుడు ఓ కొత్త మూవీని ప్రకటించాడు ఈ హీరో. ఈసారి పొలిటిక‌ల్ కామెడీ మూవీతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు. 

తాజా సినిమాకు 'మార్టిన్ లూథ‌ర్ కింగ్'(Martin Luther King) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. మంగళవారం దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో సంపూ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. సంపూర్ణేష్‌బాబు త‌ల‌పై కిరీటం ఉండ‌టం, అందులో కొంత‌మంది నాయ‌కులు ఓట్ల కోసం ప్ర‌చారం చేస్తోన్న‌ట్లుగా డిజైన్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రంలో సంపూతోపాటు డైరెక్ట‌ర్ వెంక‌టేష్ మ‌హా, న‌రేష్ కీ రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తమిళ రీమేక్ గా తెలుస్తోది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

కోలీవుడ్ లో యోగిబాబు టైటిల్ రోల్ పోషించిన మండేలా సినిమాకు రీమేక్ గా మార్టిన్ లూథ‌ర్ కింగ్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. మండేలాకు రెండు జాతీయ అవార్డ్స్  కూడా వచ్చాయి. అంతేకాకుండా బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేట‌గిరీలో ఆస్కార్ కోసం ఇండియా నుంచి నామినేట్ అయిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. అయితే దీనికి పైనల్ నామినేషన్స్ లో చోటు దక్కలేదు. పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న మార్టిన్ లూథ‌ర్ కింగ్ సినిమా పంచాయ‌తీ ఎల‌క్ష‌న్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Bigg Boss 7: సిల్లీ రీజన్స్ తో కంటెస్టెంట్స్ రచ్చ రచ్చ.. మూడో వారం నామినేషన్లో ఎవరున్నారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

Read More