Home> వినోదం
Advertisement

సంపూ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్​- ఎక్కడ చూసిన 'క్యాలీఫ్లవర్​ గురించే చర్చ'!

Sampoornesh Babu: క్యాలీఫ్లవర్​ మూవీ ట్రైలర్​ విడుదలైంది. ఈ సినిమాలో మరోసారి గ్రామ పెద్దగా కనిపించనున్నారు సంపూర్ణేశ్​ బాబు. ట్రైలర్​లో సంపూ చెప్పిన డైలాగ్స్ కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

సంపూ కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్​- ఎక్కడ చూసిన 'క్యాలీఫ్లవర్​ గురించే చర్చ'!

Cauliflower Film Trailer: బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్​ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'క్యాలీఫ్లవర్​'. 'శీలో రక్షతి రక్షితః' అనే ట్యాగ్​లైన్​తో అనే ట్యాగ్​లైన్​ విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్​ను విడుదల.. నేడు విడుదల చేసింది చిత్ర యూనిట్​.

సంపూర్ణేశ్​ బాబు హీరోగా చేసిన.. హృదయకాలేయం, సింగం 1 2 3, కొబ్బరి మట్ట సినిమాల్లానే.. క్యాలీఫ్లవర్​ కూడా పూర్తి స్థాయి కామెడి ఎంటర్​టైనర్​గా రూపొందించారు.

బట్టలు లేకుండా.. కేవలం ఓ క్యాలీఫ్లవర్​తో సంపూర్ణేశ్ బాబు లుక్​ను చిత్ర యూనిట్​ ఇటీవల విడుదల చేయగా..దానికి మంచి స్పందన లభించింది. ఇటీవల విడుదల చేసిన టీజర్​కు కూడా మంచి స్పందన లభించడంతో.. నేడు ట్రైలర్​ను లాంఛ్​ చేసింది.

Also read: సల్మాన్​ఖాన్​ను కలిసిన రాజమౌళి- బీ టౌన్​ వర్గాల టాక్ ఇదే..!

ట్రైలర్ ఎలా ఉందంటే..

ఎప్పటిలానే.. ఫన్నీ డైలాగ్స్​తో సంపూర్ణేశ్​ సీరియస్​ క్యారక్టర్​లో కనిపించే కామెడీ పాత్రను పోషించినట్లు ట్రైలర్​ ద్వారా తెలుస్తోంది.

ఎక్కడ చూసిన క్యాలీఫ్లవర్ గురించే చర్చ, వీడెవడో ఒక్క రోజులో సెన్సెషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడంటూ.. ట్రైలర్ స్టార్ అవుతుంది.

ఈ సినిమాలో కూడా ఓ సంపూ ఓ ఊరికి పెద్దగా కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఊళ్లో పుట్టిన జంతువుకైనా.. మనిషికైనా ఒక్కటే భర్త, ఒక్కటే భార్య.. అంటూ క్యాలీఫ్లవర్​ చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి.

మరి క్యాలీఫ్లవర్​కు ఏమైంది? ఎందుకు అసెంబ్లీ ఎదుట ధర్నా చేయాల్సి వచ్చింది? తను పూజకి పనికి రాని పురుషున్నైపోయా అని ఎందుకు అన్నాడు? అనే వివరాలు తెలియాలంటే.. నవంబర్ 26 వరకు వేచి చూడాల్సిందే. నవంబర్ 26న ఈ సినిమా నేరుగా థియేటర్లలో విడుదలవనుంది.

Also read: అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ షూటింగ్‌కు బ్రేక్.. డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డికి కరోనా

Also read: టాలీవుడ్ దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత... ఆరోగ్య పరిస్థితి విషమం...?

క్యాలీఫ్లవర్​ సినిమా గురించి..

ఈ సినిమాకు ఆర్​కే మాలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గూడురు శ్రీధర్ సమర్పణలో మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని నిర్మించారు. ప్రజ్వల్ క్రిష్​ సంగీతమందించారు.

సంపూర్ణేశ్​ బాబుకు జోడీగా వాసంతి నటించారు​. ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫిసర్​గా పోసాని కృష్ణ మురళి నటించారు.

Also read: సందీప్‌ రెడ్డి వంగా, రణ్‌బీర్‌ కపూర్‌‌ల..యానిమల్‌ మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్

Also read: బాలయ్య సినిమాకి భారీ పారితోషికం తీసుకుంటున్న శ్రుతీహాసన్..ఎంతో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More