Home> వినోదం
Advertisement

Samantha Ruthprabhu New Year Wishes: అందుకు ఇదే సరైన సమయం.. హాట్ టాపిక్ గా మారిన సమంత పోస్టు

Samantha Ruthprabhu Interesting Comments : సోషల్ మీడియాలో తన అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూనే మరోపక్క సమంత చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు 

Samantha Ruthprabhu New Year Wishes: అందుకు ఇదే సరైన సమయం.. హాట్ టాపిక్ గా మారిన సమంత పోస్టు

Samantha Ruthprabhu Interesting Comments on Controlling: స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన ఆమె ప్రస్తుతం అన్నింటికీ బ్రేక్ ఇచ్చేసి విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె విదేశాలకు ట్రీట్మెంట్ కోసం వెళ్లిందని ప్రచారాలు జరుగుతున్నా ఆ విషయం మీద ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.

ఇక చివరిసారిగా సమంత యశోద అనే సినిమాలో కనిపించింది. సరోగసి నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో ఆమె యశోద అనే పాతలో సమంత కనిపించింది. హరి, హరీష్ అనే దర్శకత్వ ద్వయం తెరకెక్కించిన ఈ సినిమాని నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శివలంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని భారీ బడ్జెట్లో నిర్మించారు. ఆ సంగతి అలా ఉంచితే నూతన సంవత్సరాది విచ్చేస్తున్న సందర్భంగా సమంత తన అభిమానులు అందరినీ ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.

తన ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వేదికగా ఆమె తన ఫోటో షేర్ చేస్తూ మీరు కంట్రోల్ చేయగలిగిన వాటినే కంట్రోల్ చేయండి, కొత్త లక్ష్యాల కోసం అలాగే సులభమైన లక్ష్యాల కోసం ఇదే సరైన సమయం అని ఆమె పేర్కొంది. మనకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే  నిర్దేశించుకోమని పేర్కొన్న సమంత ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయని పేర్కొంది. అంతేగాక అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023 అని విషెస్ చెబుతూ ఆమె తన అభిమానులందరినీ ఉత్తేజపరిచే ప్రయత్నం చేసింది.

ఇక సమంత చేతిలో ప్రస్తుతానికి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంతమేర పూర్తయింది. ఇక సమంత అనారోగ్యం రీత్యా ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇక మరోపక్క సమంత అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తోంది. అదేవిధంగా ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

Also Read: Janasena Clarity: ఫోటోలు దిగితే నాయకుడు అనేస్తారా? అతనికి మాకు సంబంధం లేదంటున్న జనసేన!

Also Read: Group 2 : నిరుద్యోగులకు కేసీఆర్ న్యూఇయర్ గిఫ్ట్.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
Read More