Home> వినోదం
Advertisement

Shaakuntalam Day 2 Collection : రెండో రోజుకే పూర్తిగా పడిపోయిన శాకుంతలం.. ఇక సమంతకు కష్టమేనా?

Shaakuntalam Day 2 Collection శాకుంతలం రెండో రోజు బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది. అసలే నెగెటివ్ టాక్, పూర్ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్, కథ, కథనాలు నీరసంగా సాగడంతో సినిమా మీద నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఆ ప్రభావం కలెక్షన్ల మీద పడింది.

Shaakuntalam Day 2 Collection : రెండో రోజుకే పూర్తిగా పడిపోయిన శాకుంతలం.. ఇక సమంతకు కష్టమేనా?

Shaakuntalam Day 2 Collection సమంత శాకుంతలం సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ బోల్తా కొట్టేసింది. సమంత సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంటుందని అనుకున్న అభిమానులకు ఈ సినిమా పెద్ద దెబ్బ కొట్టేసినట్టు అయింది. సమంత సత్తానే శాకుంతలం ప్రశ్నించినట్టు అయింది. ఈ సినిమా దారుణమైన టాక్‌తో, దారుణమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచేలా కనిపిస్తోంది.

సమంత శాకుంతలం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్లకు అమ్ముడుపోయిందట. ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. చివరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 19 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాకు ఆ రేంజ్లో కలెక్షన్లు వచ్చేలా కనిపించడం లేదు. రెండు రోజుల కలెక్షన్లను చూస్తుంటే.. అసలు సినిమా పది కోట్ల షేర్ అయినా వస్తుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది.

సమంత శాకుంతలం సినిమాకు మొదటి రోజు 4.7 కోట్ల గ్రాస్, 2.2 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. రెండో రోజు దగ్గరదగ్గరగా కోటి గ్రాస్, యాభై లక్షల షేర్ వచ్చినట్టు సమాచారం. అలా మొత్తానికి సమంత శాకుంతలం సినిమాకు రెండు రోజుల్లో 6.15 కోట్ల గ్రాస్, 2.9 కోట్ల షేర్ వచ్చినట్టు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ ఫస్ట్ వీకెండ్‌లోపు నాలుగు కోట్ల షేర్ అయినా వస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Also Read:  Prabhas Salaar : రెండు పార్టులుగా సలార్!.. సీక్రెట్ రివీల్ చేసిన విలన్ దేవరాజ్

వీక్ డేస్‌లో అయితే సమంత శాకుంతలం సినిమాకు కలెక్షన్లు పూర్తిగా పడిపోయేలా కనిపిస్తోంది. ఇప్పుడు ఓ సినిమా వారం రోజులు ఆడాలంటేనే కష్టంగా ఉంది. అలాంటిది ఇంతటి దారుణమైన టాక్‌తో వీకెండ్‌ను గట్టెక్కడం కూడా కష్టంగా మారింది. ఈ సినిమా సగం కూడా రాబట్టేలా కనిపించడం లేదు. ఓటీటీ, డిజిటల్ రైట్స్ కూడా తక్కువకే పోయినట్టుగా తెలుస్తోంది.

Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More