Home> వినోదం
Advertisement

Salman Khan: హోం క్వారంటైన్‌లో సల్మాన్‌ ఖాన్

దేశంలో కరోనావైరస్ (Coronavirus)మహమ్మారి విజృంభణ రోజురోజూకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రముఖులను కూడా కరోనా పట్టిపీడిస్తోంది. దీనివల్ల చాలామంది క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. 

Salman Khan: హోం క్వారంటైన్‌లో సల్మాన్‌ ఖాన్

Salman Khan in isolation: ముంబై: దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ రోజురోజూకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రముఖులను కూడా కరోనా పట్టిపీడిస్తోంది. దీనివల్ల చాలామంది క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. తాజాగా తన వ్యక్తిగత డ్రైవరుతో పాటు మరో ఇద్దరు సిబ్బందికి కరోనావైరస్ సోకడంతో ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan ) హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. సిబ్బందికి జరిపిన కరోనా పాజిటివ్ ( covid-19 positive) అని తేలడంతో.. సల్మాన్ ఖాన్‌ 14 రోజులపాటు కుటుంబసభ్యులకు దూరంగా ఉండాలని (Salman Khan in isolation) నిశ్చయించుకున్నారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులు కూడా క్వారంటైన్ అయ్యారని సమాచారం. అయితే కరోనా బారిన పడిన తన సిబ్బందిని సల్మాన్ ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. Also read: J&K: జమ్మూలో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం

దీనివల్ల సల్మాన్ తండ్రి సలీంఖాన్, సల్మాఖాన్‌ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా జరగబోయే వేడుకలను కూడా రద్దు చేశారు. అయితే ప్రస్తుతం సల్మాన్ బిగ్‌బాస్ 14 హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీకెండ్ షోలో సల్మాన్ పాల్గొంటారా.. లేదా? అనే దానిపై షో యాజామాన్యం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కరోనా లాక్‌డౌన్ సమంయలో మార్చిలో సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి పన్వెల్‌లోని ఫామ్ హౌస్‌లో గడిపారు. తన స్నేహితులతో కలిసి మూడు వీడియో ఆల్బమ్‌లను సైతం రిలీజ్ చేశారు. అంతేకాకుండా వ్యవసాయం చేస్తూ కనిపించారు. ఇదిలాఉంటే.. సల్మాన్ ప్రస్తుతం రాధే (Radhe), కబీ ఈద్ కబీ దివాలి (kabhi eid kabhi diwali) సినిమాలల్లో నటిస్తున్నాడు.  Also read: Covaxin: కోవ్యాక్సిన్ వాలంటీర్‌గా హర్యానా మంత్రి అనిల్ విజ్

Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Read More