Home> వినోదం
Advertisement

KGF Chapter 2: కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్స్! అభిమానులకు పూనకాలే ఇగ!!

Prabhas As Chief Guest For Yash KGF 2 Pre Release Event. కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెలుగులో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారని సమాచారం తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రానున్నారట. 

KGF Chapter 2: కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్స్! అభిమానులకు పూనకాలే ఇగ!!

Prabhas As Chief Guest For Yash's KGF Chapter 2 Telugu Pre Release Event: కన్నడ స్టార్ హీరో 'యష్' ప్రధాన పాత్రలో నటించిన 'కేజీఎఫ్' సినిమా మూడేళ్ల క్రితం థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలై పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ అన్ని భాషల్లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 'కేజీఎఫ్ చాప్టర్ 1'కు విశేషాదరణ దక్కడంతో సీక్వెల్‌ను త్వరగా విడుదల చేసేందుకు మేకర్స్ శరవేగంగా షూటింగ్ చేశారు. వచ్చే నెలలో రానున్న స్వీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్.. ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలుగులో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారని సమాచారం తెలుస్తోంది. పాన్ ఇండియన్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రానున్నారట. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌ను ఆహ్వానించగా అతడు ఓకే చెప్పాడట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ వస్తున్నారట. 

ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఓ డేట్ పరిశీలనలో ఉంచారట. అందుకోసం భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం తెలుస్తోంది. ఇంతకుముందు 'సలార్' మూవీ ఓపెనింగ్‌కు యష్ హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ గెస్ట్‌గా వస్తున్నాడనే విషయం చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుందట. ఇక ఆర్‌ఆర్‌ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా గెస్ట్‌లుగా రానున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఒకవేళ ముగ్గురు వెళితే.. అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్ 2' సినిమాని హోంబాలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల అవ్వనుంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. బాలీవుడ్ స్టార్లు రవీనా టాండన్, సంజయ్ దత్.. ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు నటించారు. రవి సంగీతం అందించిన ఈ సినిమాలోని మొదటి పాట (తూఫాన్) తాజాగా విడుదల అయి పెద్ద సంచలనం సృష్టించింది. 

Also Read: Samantha: సమంతకు షాక్.. పుష్ప-2లో బాలీవుడ్ భామకు అవకాశం!!

Also Read: BAN vs SA: టీమిండియా వైట్‌వాషైన చోట.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More