Home> వినోదం
Advertisement

Republic Movie Review: సాయి ధరమ్ తేజ్ నటించిన "రిపబ్లిక్" మూవీ రివ్యూ

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకతం చేసిన సినిమా 'రిపబ్లిక్'. 'వెన్నెల‌', 'ప్ర‌స్థానం', 'ఆటోన‌గ‌ర్ సూర్య' వంటి సినిమాలతో  మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ దేవాక‌ట్టా‌ తెరకెక్కించిన సినిమా ఎలా ఉందో మీరే చూడండి. 
 

Republic Movie Review: సాయి ధరమ్ తేజ్ నటించిన

సినిమా: రిపబ్లిక్ 
విడుద‌ల‌ తేదీ: 1 అక్టోబ‌ర్ 2021
నటీనటులు: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు, రమ్యకృష్ణ, ఆమని, రాహుల్ రామకృష్ణ, తదితరులు
కెమెరా: ఎం.సుకుమార్‌
స్క్రీన్‌ప్లే: దేవ్ క‌ట్టా‌, కిర‌ణ్ జ‌య్ కుమార్‌
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు
రచన-దర్శకత్వం: దేవ్ క‌ట్టా

Republic Movie Review and Rating: యాక్సిడెంట్ గురైన సాయి ధరమ్  తేజ్ నటించిన "రిపబ్లిక్" సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'వెన్నెల‌', 'ప్ర‌స్థానం', 'ఆటోన‌గ‌ర్ సూర్య' వంటి విభిన్నమైన కథలను ఎంచుకునే డైరెక్టర్ దేవకట్టా ఈ సినిమాకి దర్శకత్వం వచించారు. ఐఏఎస్ (IAS) అధికారిగా మొదటిసారి సాయి ధరమ్  తేజ్ నటించగా..  ట్రైలర్ తో అంచనాలను మరింత పెరిగాయని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మట్టుకు మెప్పించిందో చూద్దాం మరీ!

Also Read: Python Sleeps in Lap of Girl: వణుకు పుట్టిస్తున్న వీడియో.. చిన్నారి ఒళ్లో 20 అడుగుల భారీ కొండచిలువ

కథ: 
పంజా అభిరామ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌) చిన్నప్పట్నుంచే తెలివైన విద్యార్థి. అవినీతిపరుడైన తండ్రి దశరథ్ (జగపతిబాబు) భావాలను వ్యతిరేకిస్తూ పెరుగుతాడు. త‌న చుట్టుప‌క్కల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు అత‌డిని క‌ల‌చివేస్తాయి. అమెరికా వెళ్లే అవకాశాలు వచ్చినా కాదని ఐఏఎస్ (IAS) పూర్తి చేస్తాడు. ఇక విశాఖవాణి(రమ్యకృష్ణ) ఒక ప్రాంతీయ పార్టీ అధినేత్రి గుణ అనే రౌడీ గ్యాంగ్‌ సహాయంతో అధికార దాహంతో  అక్రమాల‌కు,  దౌర్జన్యాలకు, కబ్జాలకు పాల్పడుతుంది.  ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తెల్లేరు సరస్సుని కబ్జా చేసి మత్స్యగ్రంథ పేరుతో చేపల చెరువులుగా మార్చేస్తుంది. దీనిపై  ప్రశ్నించిన వారందిరిని విశాఖవాణి చంపేస్తూ వస్తుంది. ప్రత్యేక అధికారాల‌తో ఏలూరు క‌లెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు పంజా అభిరామ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌). ఎన్నా రై మైరా (ఐశ్వర్యారాజేశ్‌) ఎవరు?? విశాఖవాణిని ఎలా ఎదుర్కొన్నాడు? తెల్లేరు విష‌యంలో జ‌రిగిన పోరాటంలో గెలుపెవ‌రిది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!

Also Read: MAA Elections 2021: షాకిచ్చిన బండ్ల గణేష్.. నామినేషన్ తిరస్కరించుకున్న నిర్మాత

ఎవరెలా చేశారంటే?
ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు ఇటువంటి సినిమాలు చేయడానికి వెనకాడతారు. కానీ సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో సాహసం చేసాడనే చెప్పాలి. వ్యవస్థపై విసిగిపోయిన యువకుడిగా, అలాగే బాధ్యత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్‌గా అవినీతి పరుడైన తండ్రిని కాదని తన కాళ్లమీద తాను నిలబడే వ్యక్తిగా అభిరామ్‌ పాత్రలో ధరమ్ తేజ్‌ అదరగొట్టేశాడు. అవినీతికి పాల్పడే గ్రూప్‌ 1 అధికారి దశరథ్ పాత్రలో జగపతిబాబు, ప్రాంతీయపార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ కూడా అదరగొట్టేశారనే చెప్పాలి. అమెరికా నుంచి ఇండియా వచ్చిన యువతి మైరా(ఐశ్వర్య రాజేశ్‌) తన పాత్రకు న్యాయం చేసుకూర్చగా.. కలెక్టర్‌గా సుబ్బరాజ్‌, జగపతిబాబు భార్యగా ఆమని తదితర పాత్రలు పరిధిమేర నటించారు.

Also Read: LIVE Suicide Attempt Video:వేగంగా వస్తున్న రైలు..పట్టాలపై నిలుచున్న యువతి.. ఏం జరిగింది..?

ఎలా ఉందంటే..?
మ‌ణిశ‌ర్మ నేప‌థ్య సంగీతం, దేవ్ కట్టా డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.  సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. సినిమా ద్వారా దేవాకట్టా చెప్పాలనుకుంది ఏంటంటే... "శాస‌న వ్యవ‌స్థ‌,  అధికార వ్యవ‌స్థ‌, న్యాయ వ్యవ‌స్థ సమాంతరంగా నడిస్తేనే ప్రజాస్వామ్యం బాగుండుతుందని వీటిలో ఏది గాడి తప్పిన వ్యవస్థ మొత్తం చెడిపోతుంది". పరిపాలన వ్యవస్థలోని లోపాలు, అధికార వ్యవ‌స్థ‌ సరిగా లేకపోతే కలిగే నష్టాలు మరియు నిజాయితీపరులైన అధికారులు ఎలా బలి అవుతున్నారో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు దేవాకట్టా.  ఈ సినిమా ఇపుడున్న పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందని చెప్పవచ్చు. 
గమనిక:
రివ్యూ సినిమా చుసిన ఒక వ్యక్తి కోణానికి సంబంచినది... ఒక సగటు సినిమా అభిమాని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More