Home> వినోదం
Advertisement

Saranga Dariya​​ Video Song: సెన్సేషన్‌‌గా మారిన సాయిపల్లవి సారంగ దరియా సాంగ్

Saranga Dariya​​ Video Song From Love Story Movie: ఫ్యామిలీ, యూత్, లవ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ని మన ముందుకు తీసుకురానున్నారు. 

Saranga Dariya​​ Video Song: సెన్సేషన్‌‌గా మారిన సాయిపల్లవి సారంగ దరియా సాంగ్

Saranga Dariya​​ Video Song From Love Story Movie Is Out: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, తన నటనతో ఫిదా చేసే సాయిపల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ. ఫ్యామిలీ, యూత్, లవ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ని మన ముందుకు తీసుకురానున్నారు. 

ఇదివరకే విడుదల చేసిన తొలి పాట హే పిల్లా.. 15 మిలియన్ల వ్యూస్‌తో దూసెకెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో పాటను విడుదల చేసింది మూవీ యూనిట్. సాయిపల్లవి(Sai Pallavi) ‘సారంగ దరియా’ వీడియో సాంగ్ (Saranga Dariya​​ Video Song)ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విడుదల చేసింది. ఈ పాట విన్న వారు కచ్చితంగా సాహిత్యానికి ఫిదా అవుతారు. పాట విడుదల చేసిన గంటల్లోనే మిలియన్ వ్యూస్ సాధించింది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లవ్ స్టోరీ మూవీ ఏప్రిల్ 16వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. సీహెచ్ పవన్ స్వరాలు సమకూరుస్తున్నారు. పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మంగ్లీ పాట అంటే ఎట్టా ఉంటాదో తెలుసు కదా.. మరెందుకు ఆలస్యం Love Story Movie నుంచి సారంగ ధరియా లిరిక్స్‌ను ఆస్వాదించండి.

తాజాగా విడుదలైన తెలంగాణ జానపద గీతం సారంగ దరియా.. ప్రేక్షకాధరణ పొందుతోంది. సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన మరో అణిముత్యమే సారంగ ధరియా సాంగ్. వీరు కూడా ఈ పాటను వీక్షించండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More