Home> వినోదం
Advertisement

Sai Pallavi: చైతూతో మరోసారి జోడి కట్టనున్న సాయిపల్లవి?

NC23: కస్టడీ డిజాస్టర్ తో నాగచైతన్య ప్రస్తుతం NC23పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రానికి చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గీతాఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారంటే?
 

Sai Pallavi: చైతూతో మరోసారి జోడి కట్టనున్న సాయిపల్లవి?

Naga Chaitanya Upcoming Movie: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-చందూ మొండేటి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ తండేల్(Thandel) అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంలో గత కొన్ని రోజులగా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ సస్పెన్ష్ కు తెరపడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు సమాచారం. తాజాగా ఈ విషయానికి సంబంధించి గీతా ఆర్ట్స్‌ ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వీడియోలో హీరోయిన్ ముఖం కనిపించకుండా చేసి.. మూవీపై ఆసక్తిని పెంచేశారు మేకర్స్. అయితే దీనిపై మూవీటీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

కస్టడీ డిజాస్టర్ తర్వాత చైతూ ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. గతంలో సాయిపల్లవి-చైతూ కలిసి లవ్‌స్టోరీలో నటించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా చందు మెుండేటి కార్తికేయ2 వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై జనాల్లో ఎనలేని క్యూరియాసిటీ నెలకొంది. 

ఈ చిత్రంలో నాగచైతన్య అంతర్జాతీయ సరిహద్దు జలాల వెంబడి పాకిస్థాన్‌ దళాలకు పట్టుబడ్డ శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. దీని కోసం తన మేకోవర్ ను పూర్తిగా చేంజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారట. సుమారు రూ.70 కోట్ల వ్యయంతో గీతాఆర్ట్స్‌ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. చైతూ-చందూ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమాఇది. గతంలో వీరిద్దరూ కలిసి సవ్యసాచి, ప్రేమమ్ చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: Allu Arjun: పుష్పరాజ్​కు అరుదైన గౌరవం.. మూడో టాలీవుడ్ హీరోగా ఘనత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More