Home> వినోదం
Advertisement

Sadak 2: మరో చెత్త రికార్డు సొంతం చేసుకున్న సడక్ 2

సడక్ 2 ( Sadak 2 ) మూవీపై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు

Sadak 2: మరో చెత్త రికార్డు సొంతం చేసుకున్న సడక్ 2

సడక్ 2 ( Sadak 2 ) మూవీపై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచంలోని అత్యధిక డిజ్ లైక్స్ సంపాదించిన రెండో యూట్యూబ్ వీడియోగా చెత్త రికార్డు క్రియేట్ చేసింది. అది చాలదు అనకుండా ఈ మూవీపై కూడా ప్రేక్షకులు ప్రతాపం చూపేలా కనిపిస్తున్నారు. సడక్ 2 చిత్రం OTTలో ఇటీవలే విడుదలైంది. ఈ మూవీని ఐఎండీబిలో 35 వేల మంది డిజ్ లైక్ కొట్టారు. వేలాది మంది 1 స్టార్ ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు. 

దాంతో ఐఎండిబిలో (IMDB ) అత్యంత తక్కువ, నెగిటీవ్ రేటింగ్ సంపాదించుకున్న చిత్రంగా తొలి స్థానంలో నిలిచింది. దాని తరువాత 1.3 స్థానంతో టర్కికి చెందిన ఒక చిత్రం స్థానం కైవసం చేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ లో నెపోటిజంపై దుమారం చెలరేగింది. నెపోటిజం క్వీన్ అంటూ ఆలియాభట్ ను నెటిజెన్స్ ( Netizens ) ఆడిపోసుకుంటున్నారు. దాని ప్రభావం సడక్ 2 సినిమాపై పడింది.

Read More