Home> వినోదం
Advertisement

Allu Arjun: ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో కూలీ.. ఆ హీరోయిన్ సినిమాలతో స్టార్‌గా మారిన నటుడు..!

Laxman Meesala: అదృష్టం అనేది ఎవరికీ ఎప్పుడు ఎలా తలుపు కోడుతుందో ఎవరు చెప్పలేరు. అయితే అదృష్టం మనకి రావాలి అని రాసి ఉంటే అది ఎవ్వరూ ఆపలేరు కూడా. ప్రస్తుతం అలానే తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఒక నటుడుకి జరిగింది. ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్న ఆ వ్యక్తి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు..

Allu Arjun: ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో కూలీ.. ఆ హీరోయిన్ సినిమాలతో స్టార్‌గా మారిన నటుడు..!

Laxman Meesala: అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజపుత్ హీరోయిన్ గా చేసిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం దర్శకుడికా అజయ్ భూపతికి.. బోల్డ్ హీరోయిన్ గా పాయల్ కి.. అలానే హీరోగా కార్తికేయ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఈ చిత్రంలో వీరు ముగ్గురు కాకుండా.. పేరు సంపాదించుకున్న మరో నటుడు లక్ష్మణ్ మీసాల.

హీరో పక్కన కనిపిస్తూ సినిమా మొత్తం దాదాపు తన ప్రెజన్స్ ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు. ఇక ఈ మధ్య వచ్చిన అజయ్ భూపతి మరో సూపర్ హిట్ సినిమా మంగళవారంలో కూడా కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. అజయ్ భూపతి సినిమాల్లోనే కాదు.. మరి కొంతమంది దర్శకుల చిత్రాలలో కూడా నటించి తెలుగు వారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు ఈ ఆర్టిస్ట్.

అయితే లక్ష్మణ్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేస్తుందేవాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు విషయానికి వస్తే లక్ష్మణ్ నటుడు కాకముందు మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి కూలీగా పనిచేసారట. అవును మీరు విన్నది లక్ష్మణ్ సినిమాల్లోకి వచ్చి సక్సెస్ సాధించే ముందు తను పడ్డ కష్టాలు వింటే మనసు చలించిపోతుంది. తాజాగా లక్ష్మణ్ మీడియాకు తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.

సినిమాల్లోకి రాకముందు లక్ష్మణ్ ఏ పనిలోనూ స్థిరంగా ఉండేవారు కాదట. తన కుటుంబాన్ని పోషించడం కోసం చాలా రోజులు ఇండ్ల నిర్మాణంలో కూలీ పనులకు వెళ్లారట. అయితే తనకు తెలియకుండానే ఎంతోమంది సెలబ్రిటీల ఇళ్లలో పనిచేసానని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి నిర్మాణం సమయంలో కూడా కూలీ పని చేసానని లక్ష్మణ్ చెప్పారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ఇంటితో పాటు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కడుతున్నప్పుడు పనిచేసానని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు లక్ష్మణ్. కూలీ పనులకు వెళ్లినపుడు చాలా సార్లు దెబ్బలు తగిలాయని రక్తం కూడా వచ్చిందని చెప్పారు. సినిమాలపై ఉన్న మక్కువతో నటుడిగా కొనసాగుతున్నట్లు లక్ష్మణ్ అన్నారు.

ఇక లక్ష్మణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More