Home> వినోదం
Advertisement

RRR టీమ్ దీపావళి సర్‌ప్రైజ్ చూశారా..

దీపావళి పర్వదినం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఏదో ఒక సర్‌ప్రైజ్ ఉంటుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు రాజమౌళి ప్రతీ పండుగకు ఎదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తారని తెలుసు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ఫొటోలను పంచుకుంది.

RRR టీమ్ దీపావళి సర్‌ప్రైజ్ చూశారా..

RRR team Deepavali 2020 Special Surprise: దీపావళి పర్వదినం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఏదో ఒక సర్‌ప్రైజ్ ఉంటుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు రాజమౌళి ప్రతీ పండుగకు ఎదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తారని తెలుసు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ఫొటోలను పంచుకుంది. ఈ దీపావళి ప్రతిఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలంటూ ట్విట్ చేసింది. అభిమానులకు ఈ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురు కూడా తెల్లటి దుస్తులు ధరించి ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. వీరిని చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విట్టర్ వేదికగా ఫొటోలను పంచుకోగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also read: Apsara Rani: అందచందాలతో పిచ్చెక్కిస్తున్న అప్సర..

ఏదీఏమైనప్పటికీ.. దర్శకరత్న రాజమౌళి (SS Rajamouli) తన సినిమా ఎప్పుడూ కూడా వార్తల్లో ఉండేలా ప్రచారం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దాదాపు 300 కోట్లతో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. రౌద్రం ర‌ణం రుధిరం ( RRR ) సినిమాను రాజ‌మౌళి చ‌రిత్ర, ఫిక్షన్‌ అంశాల కలబోత ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ (Jr. NTR)‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా  రామ్‌చరణ్  (Ram charan) నటిస్తున్నారు. వారి సరసన అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా, అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. 

Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?

Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe  

Read More