Home> వినోదం
Advertisement

RRR movie jr ntr interview: బాలయ్య బాబాయ్​తో, చిరంజీవితో మల్టీ స్టారర్​కు రెడీ: ఎన్టీఆర్​

RRR movie jr ntr interview: యంగ్ టైగర్ ఎన్టీఆర్​ మల్టీ స్టారర్​ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ బాబాయ్​తో కలిసి నటించాలని ఉందని చెప్పారు. చిరంజీవి, నాగార్జున, మహేశ్​ బాబు అందరితో నటించేందుకు సిద్దమని తెలిపారు.

RRR movie jr ntr interview: బాలయ్య బాబాయ్​తో, చిరంజీవితో మల్టీ స్టారర్​కు రెడీ: ఎన్టీఆర్​

RRR movie jr ntr interview: ప్రస్తుతం టాలీవుడ్​లో మల్టీ స్టారర్​ల హవా నడుస్తోంది. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ నుంచి.. త్వరలో విడుదల కానున్న 'ఆర్​ఆర్​ఆర్​' క్రేజీ మూవీస్​ అన్ని మల్టీస్టారర్​ కావడం గమనార్హం. ఇక ఇదే విషయంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​ స్పందించారు. బాలయ్య బాబాయ్​తో మల్టీ స్టారర్​ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు.

ఇంతకీ ఏమైందంటే..

ఎన్టీఆర్​, రామ్​చరణ్​లు ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్​ఆర్​ఆర్​ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ మూవీ 25న థియేటర్లలో సందడి చేయనుంది. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్​ మీడియాతో ముచ్చటించింది. ఇందులో ఎదురైన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్​ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

'టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. మల్టీ స్టారర్ మూవీస్ కు క్రేజ్ పెరిగింది. అందుకు తగ్గట్లే అగ్రహీరోలంతా మల్టీ స్టారర్ సినిమాలకు సై అంటున్నారు. ఇప్పటికే ఆర్​ఆర్​ఆర్​ మూవీలో రామ్ చరణ్​తో కలిసి నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీయార్.. మరో మల్టీ స్టారర్ మూవీకి సిద్ధం' అని ప్రకటించారు.

బాబాయ్ బాలయ్యతో తాను కలిసి నటించాలనుకుంటున్నట్లు చెప్పారు ఎన్టీఆర్​. చిరంజీవి, నాగార్జున, మహేష్‌, ప్రభాస్, అల్లు అర్జన్ అందరితోనూ తాను మల్టీ స్టారర్ సినిమా చేస్తానని చెప్పారు ఎన్టీఆర్​. ఒకప్పుడు హీరో పాత్ర ప్రయారిటీ, సీన్లపై తేడాలుండేవని.. ఇప్పటి జనరేషన్ వాటన్నింటినీ దాటుకుని ముందుకొచ్చారన్నారు ఎన్టీఆర్. హీరో పాత్రలు ఇలానే ఉండాలనే లెక్కలు ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదన్నాడు. అభిమానులు కూడా పాత్రల నిడివి పట్టించుకోవడం మానేశారన్నారు. అందుకే ఎవరైనా ఏ భాషలోనైనా నటించొచ్చని చెప్పుకొచ్చారు.

Also read: Surekha Konidela: ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన చిరంజీవి సతీమణి.. మొదటి పోస్ట్ ఏంటో తెలుసా?!!

Also read: Naina Ganguly Bold Pictures: నైనా గంగూలీ బోల్డ్ ఫొటోస్.. ఇలా ఎప్పుడూ చూసుండరు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More