Home> వినోదం
Advertisement

RRR mass song: త్వరలోనే ఆర్ఆర్ఆర్ నుంచి మాస్ సాంగ్

RRR movie song: ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్ ఇప్పటికే ట్రెండ్ సెట్ చేస్తుండగా తాజాగా మరో పాటను విడుదల చేసేందుకు ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ వర్గాలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.

RRR mass song: త్వరలోనే ఆర్ఆర్ఆర్ నుంచి మాస్ సాంగ్

RRR movie song: ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి దుమ్మురేపే మాస్ సాంగ్ వచ్చేస్తోందా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్ ఇప్పటికే ట్రెండ్ సెట్ చేస్తుండగా తాజాగా మరో పాటను విడుదల చేసేందుకు ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ వర్గాలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.

మెగా వపర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఇద్దరిపైనా చిత్రీకరించిన ఈ మాస్ సాంగ్‌ని త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు టాలీవుడ్ టాక్. ఇదిలావుంటే, రామ్ చరణ్, ఆలియా భట్ జంటపై (Ram Charan, Alia Bhatt song) చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ అయినా అయి ఉండవచ్చనే టాక్ కూడా గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో రకరకలా ప్రచారాలు జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో అసలు ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie) నుంచి విడుదలయ్యే ఆ సాంగ్ ఏమై ఉంటుంది ? ఎప్పుడు ఆ సాంగ్ విడుదలవనుందా అని ఆడియెన్స్‌తో పాటు అటు రాజమౌళి అభిమానులు, ఇటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr finger surgery) అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో పాటల చిత్రీకరణకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే అభిమానులు ఈ మాస్ సాంగ్ కోసం వెయిటింగ్.

Read More