Home> వినోదం
Advertisement

Romantic Badass Trailer: రొమాంటిక్ మూవీ నుంచి మరో ట్రైలర్.. యూత్‌కి హీటెక్కించే సీన్స్

Romantic Badass Trailer: ఇప్పటికే రొమాంటిక్ మూవీ టీజర్, రొమాంటిక్ ట్రైలర్లకు భారీ స్పందన కనిపించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగానే తాజాగా రొమాంటిక్ మూవీ నుంచి రొమాంటిక్ బదాస్ ట్రైలర్ (Romantic Badass Trailer) పేరిట మరో ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.

Romantic Badass Trailer: రొమాంటిక్ మూవీ నుంచి మరో ట్రైలర్.. యూత్‌కి హీటెక్కించే సీన్స్

Romantic Badass Trailer: రొమాంటిక్ మూవీ రిలీజ్ డేట్‌కి మరో నాలుగు రోజులే సమయం మిగిలి ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో అభిమానులను, ఆడియెన్స్‌ని ఊరించే రీతిలో రొమాంటిక్ మూవీ యూనిట్ నుంచి ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే రొమాంటిక్ మూవీ టీజర్, రొమాంటిక్ ట్రైలర్లకు భారీ స్పందన కనిపించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగానే తాజాగా రొమాంటిక్ మూవీ నుంచి రొమాంటిక్ బదాస్ ట్రైలర్ (Romantic Badass Trailer) పేరిట మరో ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. 

రొమాంటిక్ ట్రైలర్‌లో ఎలాగైతే కుర్రకారును హీటెక్కించే సీన్స్, డైలాగ్స్ జొప్పించారో.. తాజా ట్రైలర్‌లోనూ అలాగే యూత్‌కి పిచ్చెక్కించే క్లిప్పింగ్స్, డైలాగ్స్‌తో టీజ్ చేశారు. రొమాంటిక్ బడాస్ ట్రైలర్ గురించి చెప్పడం కంటే చూస్తేనే ఇంకా బాగా అర్థమవుతుంది.

Also read : Salman Antim Trailer: సల్మాన్ ‘'అంతిమ్‌’' ట్రైలర్‌ అదిరిపోయిందిగా

పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ (Actress Charmee Kaur) సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్ సినిమాను అనిల్ పాడూరి డైరెక్ట్ చేశాడు. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి సరసన కేతిక శర్మ జంటగా నటించింది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ (Director Puri Jagannath) స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. లోఫర్, ఒక మనసు, బాబు బాగా బిజీ వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించిన సునీల్ కశ్యప్ ఈ రొమాంటిక్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. 

రొమాంటిక్ మూవీ ట్రైలర్లలో (Romantic Trailers) చూపించినట్టుగా యూత్‌ని ఎట్రాక్ట్ చేసేలా రొమాంటిక్ మూవీ ఉండనుందా లేదా ? అలాగే పూరి ఆకాశ్ (Akash Puri speech at Romantic movie pre-release event) ఆశపడుతున్నట్టుగానే ఈ సినిమా అతడికి సూపర్ సక్సెస్‌ని అందిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ నెల 29న సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.

Also read : Avneet Kaur: బంటి.. నీ సబ్బు స్లోఆ ఏంటి..?? యాడ్‌లో పాప ఇప్పుడెలా ఉందో తెలుసా..??

Also read : Varudu Kaavalenu Movie Promotions: 'వరుడు కావలెను' మూవీ ప్రమోషన్స్​.. ఇలా కూడా చేస్తారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More