Home> వినోదం
Advertisement

Rakesh on Anchor Rashmi: రష్మీ అలా డబ్బు సంపాదిస్తోంది.. రాకేష్ షాకింగ్ కామెంట్స్!

Rocking Rakesh on Anchor Rashmi Earnings: యాంకర్ రష్మీ అలా చేస్తూ డబ్బు సంపాదిస్తోంది అంటూ రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే 
 

Rakesh on Anchor Rashmi: రష్మీ అలా డబ్బు సంపాదిస్తోంది.. రాకేష్ షాకింగ్ కామెంట్స్!

Rocking Rakesh Sensational Comments on Anchor Rashmi Earnings: యాంకర్ రష్మీ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఒరిస్సాకి చెందిన అమ్మాయి అయినా సరే విశాఖపట్నంలోనే పుట్టి పెరగడం వల్ల కొంతవరకు తెలుగు మీద ఆసక్తి పెంచుకొని సినీ ప్రయత్నాలు చేసింది. సినిమాల్లోకి వచ్చాక చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ ఆమెకు గుర్తింపు అయితే దక్క లేదు.

అయితే ఎప్పుడైతే జబర్దస్త్ అనే షో ద్వారా ఆమె యాంకర్ గా పరిచయమైందో అప్పటినుంచి ఆమెకు క్రేజ్ పెరగడం మొదలైంది. ఇక సుడిగాలి సుధీర్ తో మల్లెమాల సంస్థ ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ లవ్ ట్రాక్ వీరిద్దరికి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. అయితే యాంకర్ గా ఒక పక్క కొనసాగుతూనే మరోపక్క హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేసింది. కొన్ని హారర్ సినిమాలు కొన్ని బి గ్రేడ్ సినిమా లాంటివి కూడా చేసింది. అలా చేసిన సినిమాల్లో గుంటూరు టాకీస్ ఒక్కటే సూపర్ హిట్ అయింది.

ఆ తర్వాత ఆమె ఎన్ని హారర్ సినిమాలు చేసినా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా ఏవీ కలిసి రాలేదు. ఇటీవల నందు హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా కూడా భారీ అంచనాలతో విడుదలయింది కానీ ఎందుకనో అసలు ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఎటోచ్చి తనపై యాంకరింగ్ ఉండనే ఉంది కాబట్టి రష్మీ మాత్రం ఎలాంటి నిరాశకు లోనవ్వకుండా మరోపక్క తన యాంకరింగ్ కొనసాగిస్తూ వెళుతోంది.

అయితే తాజాగా 30వ తేదీ డిసెంబర్ నెలలో ప్రసారం కాబోతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కమెడియన్ రాకింగ్ రాకేష్ రష్మీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ స్కిట్లో భాగంగా రాకింగ్ రాకేష్ ఒక దొంగ స్వామీజీ గెటప్లో కనిపించారు. అలా కనిపిస్తూ ఉండగా తన పక్కనే ఉన్న ప్రవీణ్ యాంకర్ రష్మీ జాతకం కూడా చెప్పమని అడుగుతాడు. దానికి రాకింగ్ రాకేష్ అందరూ డబ్బులు లేకపోతే గుండెలు భాదుకుంటారు కానీ ఈమె గున్నా గున్నా మామిడి అనే సాంగ్ డాన్స్ వేస్తూ గుండెలు బాదుకుంటూ డబ్బులు సంపాదిస్తోంది అంటూ కామెంట్స్ చేశాడు.

వాస్తవానికి ఈ గున్నా గున్నా మామిడి అనే సాంగ్ ద్వారా రష్మీకి మరింత పాపులారిటీ వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె తనమైన శైలిలో డాన్స్ చేస్తూ ఈ సాంగ్ కు కూడా మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఇక ఈ క్రమంలో రష్మీ గుండెలు బాదుకుంటూ సంపాదిస్తోంది అంటూ రాకింగ్ రాకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటో కూడా తెలియజేయండి.

Also Read: Ketika Sharma hot: క్రిస్మస్ బేబీ కేతిక శర్మ హాట్ ట్రీట్.. ఇదెక్కడి అందాల ఆరబోతరా?

Also Read: Chiranjeevi Vs Balakrishna: బాలయ్యను మళ్లీ చిత్తు చేసిన చిరంజీవి.. మూడో సారీ అదే జోరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 
Read More